Liver Cancer: ఈ వంట పాత్రలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? కాలేయ క్యాన్సర్ ముప్పు ఉన్నట్లే.. తస్మాత్ జాగ్రత్త
Health Tips: మనం రోజూ ఉపయోగించే కొన్ని వంటపాత్రలు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని నాలుగు రెట్లు పెంచుతాయని తాజా అధ్యయనంలో తేలింది. యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ సంయుక్తంగా నిర్వహించిన ..
Health Tips: మనం రోజూ ఉపయోగించే కొన్ని వంటపాత్రలు కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని నాలుగు రెట్లు పెంచుతాయని తాజా అధ్యయనంలో తేలింది. యూనివర్శిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా, లాస్ ఏంజెల్స్ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం, మనం నిత్యం ఉపయోగించే అల్యూమినియం(Aluminum), నాన్ స్టిక్(Non stick) వంట పాత్రలు , కుండలు, కత్తులు, గిన్నెలలో శాశ్వతంగా ఉండే సింథటిక్ రసాయనాలు కాలేయ క్యాన్సర్ ప్రమాదంతో పాటు జీర్ణవ్యవస్థకు హాని కలిగిస్తాయని, అల్జీమర్స్ సమస్యలు కూడా పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘పర్ ఫ్లోరో ఆక్టేన్ సల్ఫేట్ (PFAS) అనే రసాయనం.. నాన్ స్టిక్ వంట పాత్రలు, నల్లాలు, సముద్రపు ఆహారం, వాటర్ ప్రూఫ్ బట్టలు, క్లీనింగ్ టూల్స్, ఆఖరికి షాంపూల్లో కూడా ఉంటుంది. ఇది కాలేయ క్యాన్సర్‌ను ప్రమాద తీవ్రతను పెంచుతుంది’ అని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు.
మట్టిపాత్రలే మేలు..
PFOS, కాలేయంలోకి ప్రవేశించిన తర్వాత, కొవ్వు కాలేయ వ్యాధులతో పాటు సిర్రోసిస్‌కు దారితీస్తుందని ఈ అధ్యయనం సూచించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ రసాయనాలు ప్రమాదకరమని గతంలోనే తేలింది. అయితే ఇప్పుడు దాని ప్రమాద తీవ్రతకు సంబంధించి పూర్తిగా స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అధ్యయనంలో ప్రధానంగా పరిశోధకులు కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్న 50 మందిని అలాగే కాలేయ క్యాన్సర్ లేని 50 మందిని పరీక్షించారు. ఈ అధ్యయనంలో రెండు సమూహాల వ్యక్తుల నుండి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించారు. ప్రజలు తమ వంటలలో ఈ రకమైన వస్తువులను ఉపయోగించడం సాధారణం. అయితే ఈ కెమికల్‌కి ఎక్కువ కాలం గురికావడం వల్ల లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందన్న షాకింగ్ విషయం బయటపడింది. ఈ మేరకు క్యాన్సర్ ఉన్నవారి రక్త నమూనాలలో అనేక రకాల రసాయనాలు ఉన్నట్లు, ఈ కెమికల్స్‌కు తక్కువగా ప్రభావితమైన వారితో పోల్చుకుంటే ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయిన వారు 4.5 రెట్లు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నదని గుర్తించారు. ఈక్రమంలో అల్యూమినియం, నాన్ స్టిక్ పాత్రలను వాడకుండా వీలైనంత వరకు మట్టి పాత్రల్లోనే వంట చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..