Lifestyle: పిల్లలకు ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో పాలు ఇస్తున్నారా.? వైద్యులు ఏమంటున్నారంటే

ప్రస్తుతం ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారింది. ఇక ప్లాస్టిక్‌ బాటిల్స్‌గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వాడే వారి సంఖ్య ఎక్కువుతోంది. అయితే ప్లాస్టిక్‌ వాడకం ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతునే ఉంటారు. అయితే ప్లాస్టిక్‌ బాటిల్స్‌ పెద్దలతో పోల్చితే చిన్న పిల్లలకు మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు...

Lifestyle: పిల్లలకు ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో పాలు ఇస్తున్నారా.? వైద్యులు ఏమంటున్నారంటే
Milk Bottle
Follow us

|

Updated on: Sep 12, 2024 | 5:47 PM

ప్రస్తుతం ప్లాస్టిక్‌ వినియోగం అనివార్యంగా మారింది. ఇక ప్లాస్టిక్‌ బాటిల్స్‌గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌ వాడే వారి సంఖ్య ఎక్కువుతోంది. అయితే ప్లాస్టిక్‌ వాడకం ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతునే ఉంటారు. అయితే ప్లాస్టిక్‌ బాటిల్స్‌ పెద్దలతో పోల్చితే చిన్న పిల్లలకు మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో పాలు లేదా నీరును చిన్నారులకు ఇవ్వడం మంచిది కాదని సూచిస్తున్నారు.

పాలను వేడి చేసి వాటిని ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో పోయడం ద్వారా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్‌ బాటిల్స్‌లో వేడి పాలు పోస్తే.. చిన్నారుల శరీరంలోకి మైక్రోప్లాస్టిక్ వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. చిన్నారుల కడుపులోకి వెళ్లే మైక్రోప్లాస్టిక్‌ కారణంగా వారి మెదడుపై ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

పిల్లల ఎదుగుదలపై కూడా ప్రభావం చూపుతుందని అంటున్నారు. మైక్రోప్లాస్టిక్ శరీరంలో వెళ్లడం వల్ల పిల్లల రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే చిన్నారులకు ఇచ్చే పాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్‌లో కూడా ఈ విషయాలను స్పష్టం చేశారు. వీటి ప్రకారం ప్లాస్టిక్ బాటిళ్లను అస్సలు ఉపయోగించకూడదని చెబుతున్నారు. ప్లాస్టిక్‌ బాటిల్స్‌కు బదులుగా స్టీల్‌ లేదా కాచు బాటిల్స్‌ లేదా గ్లాసులలో చిన్నారులకు పాలను అందించాలని సూచిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్స్ లో పాలను అందించడం వల్ల పాల రుచి కూడా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

చైనాలో కొత్త రకం వైరస్‌.. ఈసారి డైరెక్ట్‌ గా అది డేమేజ్ అవుతుంది.
చైనాలో కొత్త రకం వైరస్‌.. ఈసారి డైరెక్ట్‌ గా అది డేమేజ్ అవుతుంది.
విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు.కొన్ని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు
విశాఖలో విరిగిపడుతున్న కొండచరియలు.కొన్ని ఇళ్లకు పొంచి ఉన్న ముప్పు
రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!
రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం ఆపడానికేనా.? అది భారత్ కే సాధ్యమా.!
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.
వాయుగుండంగా మారిన అల్పపీడనం.. ఉత్తరాంధ్రపై భారీ ఎఫెక్ట్‌.
నడిరోడ్డుపై నెమళ్ల గుంపులు.. పురి విప్పి నాట్యం చేస్తూ సందడి.!
నడిరోడ్డుపై నెమళ్ల గుంపులు.. పురి విప్పి నాట్యం చేస్తూ సందడి.!
ఇంట్లోకి చొరబడి గడియ పెట్టుకున్న కోతులు !! చివరికి ??
ఇంట్లోకి చొరబడి గడియ పెట్టుకున్న కోతులు !! చివరికి ??
అప్పుడే బిగ్ బాస్8లోకి వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఇక అందాల రచ్చ రచ్చే
అప్పుడే బిగ్ బాస్8లోకి వైల్డ్ కార్డ్‌ ఎంట్రీ ఇక అందాల రచ్చ రచ్చే
అనన్య పాండే వెబ్ సిరీస్‌ను మెచ్చిన మెగా కోడలు
అనన్య పాండే వెబ్ సిరీస్‌ను మెచ్చిన మెగా కోడలు
అమ్మ అవబోతున్న తాప్సీ ?? వైరల్‌గా మారిన వీడియో..
అమ్మ అవబోతున్న తాప్సీ ?? వైరల్‌గా మారిన వీడియో..
ఒక్క చిన్న తప్పు.. ఎయిడ్స్‌ భారిన పడి స్టార్ హీరోయిన్‌ మృతి
ఒక్క చిన్న తప్పు.. ఎయిడ్స్‌ భారిన పడి స్టార్ హీరోయిన్‌ మృతి