సర్వేంద్రియానం నయనం ప్రధానం.. కంటి ఆరోగ్యానికి అద్భుతమైన ఫుడ్స్.. ఇక తిరుగుండదు..

సర్వేంద్రియానం నయనం ప్రధానం ప్రధానం అన్నారు మన పూర్వీకులు.. కళ్లు చాలా విలువైనవి.. వాటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా నేటి డిజిటల్ యుగంలో ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడిపేస్తున్నారు. కంటి చూపు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఎ తీసుకోవడం అవసరం..

Shaik Madar Saheb

|

Updated on: Sep 12, 2024 | 4:44 PM

వివిధ కారణాల వల్ల కంటి కింద భాగం ఉబ్బుతుంది. రోజంతా ఫోన్‌ చూడటం, తగినంత నిద్ర లేకపోవడం, వయస్సు కారణంగా ఈ సమస్యలు తలెత్తుతాయి. కొబ్బరినూనెను కళ్లకింద రాసుకుని తేలికగా చేతులతో మసాజ్ చేయడం వల్ల సమస్య చాలా వరకు తగ్గుతుంది.

1 / 6
క్యారెట్లు: క్యారెట్లలో మన కళ్లను కపాడుతాయి.. క్యారెట్లలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎగా మారుతుంది. క్యారెట్‌లను రోజూ తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. కంటి సంబంధిత వ్యాధుల భయం తగ్గుతుంది.

2 / 6
బీట్‌రూట్: బీట్‌రూట్ లలో బీటా కెరోటిన్ కూడా పుష్కలంగా ఉంటుంది. కంటికి అద్భుతమైన ఆహార పదార్థం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా ఇతర శరీర విధులకు కూడా మేలు చేస్తాయి.

3 / 6
Egg

Egg

4 / 6
ఆకుకూరలు: పచ్చి ఆకు కూరలలో బచ్చలికూర విటమిన్ ఎకి మంచి మూలం. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ అనే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి హానికరమైన UV కిరణాల నుంచి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి. ఇంకా కంటిశుక్లం వంటి సమస్యలను నివారిస్తాయి.

5 / 6
చేపలు: సాల్మన్ చేపలో విటమిన్ ఎ, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కళ్లు పొడిబారడం, ఇతర సమస్యలను తొలగించడంలో సహాయపడతాయి. ఇది కళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీర్ఘకాలం పాటు మంచి దృష్టిని నిర్వహించడానికి సహాయపడుతుంది.

6 / 6
Follow us