హ్యుందాయ్ 2023లో ఎక్స్‌టర్‌తో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ మైక్రో ఎస్‌యూవీ భారతీయ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న వాహనాలలో ఒకటిగా ఉంది. ఎక్స్‌టర్ ఎస్‌ఎక్స్ వేరియంట్ నుంచి సన్‌రూఫ్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 8.23 లక్షలు. ఎస్ఎక్స్ నైట్, ఎస్ఎక్స్(ఓ), ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్, ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్ నైట్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్‌టర్ 82 బీహెచ్‌పీ, 113.8 ఎన్ఎమ్ అవుట్‌పుట్‌తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.