AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pregnancy Diet: గర్భధారణ సమయంలో కూల్ డ్రింక్స్, ప్యాకెడ్ జ్యుసెస్ తాగుతున్నారా.. మీ బిడ్డను ప్రమాదంలో పడేసినట్లే..

గర్భధారణ సమయంలో ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్లతో పాటు శీతల పానీయాలకు దూరంగా ఉండడం మంచిందని.. వీటిని తాగడం వలన తల్లిబిడ్డ ఆరోగ్యానికి హానికరం అని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడి లేని, ఆరోగ్యకరమైన డెలివరీ కోసం గర్భిణీస్త్రీలు సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అదే  సమయంలో అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ శీతల పానీయాలు తాగితే.. పిండానికి హాని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.  

Pregnancy Diet: గర్భధారణ సమయంలో కూల్ డ్రింక్స్, ప్యాకెడ్ జ్యుసెస్ తాగుతున్నారా.. మీ బిడ్డను ప్రమాదంలో పడేసినట్లే..
Pregnancy Health Tips
Surya Kala
|

Updated on: Nov 19, 2023 | 1:41 PM

Share

గర్భధారణ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం మొదలు రోజు వారీ చేసే ప్రతి చిన్న పనిలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణిగా ఈ 9 నెలల దశ చాలా సున్నితమైనవి. గర్భధారణ సమయంలో ప్రతి స్త్రీలో హార్మోన్లలో అనేక మార్పులు సంభవిస్తాయి. దీని కారణంగా ఈ సమయంలో ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వస్తాయి. చాలా సార్లు వివిధ రకాలైన వస్తువులను తినాలనే కోరిక కలుగుతుంది. అయితే ఈ సమయంలో తినే ఆహారం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అనారోగ్యాన్ని కలిగించే ఆహారానికి  దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూస్లతో పాటు శీతల పానీయాలకు దూరంగా ఉండడం మంచిందని.. వీటిని తాగడం వలన తల్లిబిడ్డ ఆరోగ్యానికి హానికరం అని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఒత్తిడి లేని, ఆరోగ్యకరమైన డెలివరీ కోసం గర్భిణీస్త్రీలు సమతుల్య ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం. అదే  సమయంలో అనారోగ్యకరమైన ఆహారానికి దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ప్రెగ్నెంట్ ఉమెన్ శీతల పానీయాలు తాగితే.. పిండానికి హాని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

వైద్యులు ఏమి చెప్పారంటే..

శీతల పానీయాలలో చక్కెర పరిమాణం చాలా ఎక్కువగా ఉంటుందని, అలాగే సాచరిన్ అంటే కృత్రిమ స్వీటెనర్ (శీతల పానీయాలు, ప్యాక్ చేసిన జ్యూస్‌లలో తీపి కోసం ఉపయోగించే ఒక రకమైన రసాయనిక  సమ్మేళనం) ఈ డ్రింక్స్ లో ఉపయోగిస్తారు. ఇది గర్భిణీలకు, పిల్లలకు హానికరం అని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యురాలు మనాలి చెప్పారు. తల్లీబిడ్డ ఇద్దరికీ ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీలయితే శీతల పానీయాలు దూరంగా..

ప్రెగ్నెన్సీ సమయంలో శీతల పానీయాలు తాగడం మానుకోవాలని.. అయితే తాగాలని విపరీతమైన కోరిక ఉంటే.. రెండు మూడు నెలలకు ఒకసారి లేదా రెండు సార్లు శీతల పానీయాలు తాగవచ్చని, అది కూడా చాలా తక్కువ పరిమాణంలో తాగవచ్చని డాక్టర్ మనాలి చెప్పారు. ఇంతకంటే ఎక్కువగా శీతల పానీయాలు తీసుకుంటే హాని కలుగుతుందని వెల్లడించారు.

దుష్ప్రభావాల ప్రమాదం

శీతల పానీయాలలో రుచి, రంగు కోసం చాలా రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇవి ప్రజల ఆరోగ్యానికి మంచివి  కాదు. అదే సమయంలో గర్భధారణ సమయంలో ఇది మరింత హానికరం. అలెర్జీలు, బరువు పెరగడం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి పెరగడం వంటి అనేక రకాలైన ఆరోగ్య ప్రమాదాలను పెంచుతుంది. అందువల్ల, ఆరోగ్యకరమైన గర్భం కోసం చల్లని పానీయాలను దూరంగా పెట్టండి.

త్రాగడానికి ముందు తనిఖీ చేయండి

గర్భధారణ సమయంలో శీతల పానీయం లేదా ఏదైనా ప్యాక్ చేసిన శీతల పానీయాన్ని తీసుకోవాలనుకుంటే, ప్యాకెట్‌పై వ్రాసిన పదార్థాల లిస్ట్ ను జాగ్రత్తగా చదవండి. ఎందుకంటే అందులో ఉన్న కొన్ని రకాల పదార్ధాలు తల్లి, బిడ్డ ఇద్దరికీ చాలా అనారోగ్యాన్ని కలిగించేవి ఉంటాయి. అయితే గర్భిణీ స్త్రీలు చల్లని పానీయాలను తాగాలనుకుంటే కూల్ డ్రింక్స్ బదులుగా మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, నిమ్మరసం, కూరగాయల సూప్ వంటి సహజమైన వారిని ఎంచుకోవచ్చు అని సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..