Hair Care: జుట్టు ఊడిపోతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు..

Amarnadh Daneti

Amarnadh Daneti |

Updated on: Jan 01, 2023 | 9:49 AM

Hair Care Tips: చాలా మంది జట్టు ఊడిపోతుందని, ఈ సమస్యకు పరిష్కారం లేదా అని ఆలోచిస్తుంటారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య మాత్రం ఇబ్బందిపెడుతూనే ఉంటుంది. అలాగే  జుట్టు సంరక్షణ కోసం..

Hair Care: జుట్టు ఊడిపోతుందా.. ఈ చిట్కాలు పాటిస్తే సమస్య నుంచి త్వరగా ఉపశమనం పొందొచ్చు..
Hair Falling

Hair Care Tips: చాలా మంది జట్టు ఊడిపోతుందని, ఈ సమస్యకు పరిష్కారం లేదా అని ఆలోచిస్తుంటారు. కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా సమస్య మాత్రం ఇబ్బందిపెడుతూనే ఉంటుంది. అలాగే  జుట్టు సంరక్షణ కోసం ఎన్నో ఆయిల్స్ సైతం వాడుతూ ఉంటారు. కాని అనుకున్నంత ఫలితం ఉండకపోవచ్చు. ఎక్కువ మంది హెయిర్ కేర్ కు ప్రాధాన్యత ఇస్తారు. ఎంత కేర్ తీసుకున్న కొంతమంది జుట్టు ఊడిపోతూ ఉంటుంది. దీనికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారు తక్కువ ఖర్చుతో సహజమైన మాస్క్ లు ఉపయోగించి జుట్టును సంరక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం, దానిని వేగంగా పెరిగేలా చేయడం కోసం ఖచ్చితంగా హెయిర్ మాస్క్​లను ప్రయత్నించవచ్చని సూచిస్తున్నారు. ఎక్కువ ఖర్చుపెట్టి.. జుట్టును రసాయానాలతో నింపేసే బదులు.. హాయిగా ఇంట్లో దొరికే వస్తువులతో మంచి ప్యాక్స్ వేసుకుని హెయిర్​ని కాపాడుకోవచ్చు. హెయిర్ గ్రోత్​కి ఉపయోగపడే ప్యాక్‌లు ఏంటో తెలుసుకుందాం.

ఆముదం, తేనె

జుట్టు పెరుగుదలకు ఆముదం వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికి తెలిసినవే. ఈ నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును మంచిగా మాయిశ్చరైజ్ చేస్తుంది. ఈఆయిల్ లోని యాంటీమైక్రోబయల్ లక్షణాల వల్ల నెత్తిమీద పొడిబారడం, పొట్టును కూడా తగ్గిస్తుంది. తేనె కూడా జుట్టుకు సహజసిద్ధంగా తేమనిస్తుంది. అందమైన మెరుపును ఇస్తుంది. రెండు చెంచాల ఆముదం నూనెలో ఒక చెంచా తేనెను జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని వేడి చేసి.. మాస్క్‌ను తలకు పట్టించి.. చేతివేళ్లతో సున్నితంగా మసాజ్ చేయాలి. 30 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు ఉంచి.. గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.

అవోకాడో, బనానా

అవోకాడో, అరటిపండ్లు రెండింటిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మెరిసే, ఆరోగ్యకరమైన జుట్టుకు అవసరమైన పోషక పదార్ధాలను తిరిగి పొందేలా ఈపండ్లు చేస్తాయి. అరటిపండుతో సగం అవకాడోను మెత్తగా పేస్ట్ అయ్యేవరకు గ్రైండ్ చేయాలి. మిశ్రమాన్ని మూలాల నుంచి చివరల వరకు తలపై అప్లై చేయండి. కనీసం 15 నిమిషాలు అలాగే ఉండనివ్వాలి. ఆరోగ్యకరమైన జుట్టు కోసం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మందార మాస్క్

మందార పువ్వులు, మందార ఆకులు రెండూ యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇవి కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. జుట్టు వేగంగా, పొడవుగా, మందంగా పెరగడానికి సహాయపడుతుంది. కొన్ని పువ్వులు, ఆకులను తీసుకొని నీటిలో ఉడకబెట్టాలి. రసాన్ని తీసుకొని జుట్టుకు అప్లై చేసి కనీసం 15 నిమిషాల పాటు కూర్చోవాలి. చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.

వెల్లుల్లి, ఉల్లిపాయలతో

వెల్లుల్లి, ఉల్లి యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ రెండు పదార్ధాలు ఫ్లాకీనెస్, చుండ్రుని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండు పదార్థాలను ఒక గిన్నెలో వేసి.. మీ రెగ్యులర్ హెయిర్ ఆయిల్‌ను మిశ్రమానికి జోడించండి. మందపాటి పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి 30 నుంచి 45 నిమిషాలు అలాగే ఉంచాలి. బలమైన వాసన కలిగిన ఈ పదార్థాల వాసనను క్లియర్ చేయడానికి షాంపూతో శుభ్రం చేసుకోవాలి.

మెంతి గింజలు, మొరింగ మాస్క్

మొరింగ ఆకుల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బలహీనమైన, పెళుసుగా ఉండే జుట్టు.. ఆరోగ్యంగా పెరగడానికి ఇది సహాయపడుతుంది. మెంతి గింజలు జుట్టు పెరుగుదలకు అనువైనవిగా చెబుతారు. ఇవి జుట్టు కుదుళ్లు వేగంగా పెరిగేలా చేస్తాయి. మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. కొన్ని మొరింగ ఆకులను తీసుకుని వాటిని మెంతి నీరు, గింజలతో మెత్తగా పేస్ట్ చేయాలి. దీనిని తల మొదలు నుంచి చివర వరకు అప్లై చేయాలి. 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు దీనిని అలాగే ఉంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో బాగా కడిగేసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu