Pearl Millet: ఓ మై గాడ్.. సజ్జలతో చర్మ ఆరోగ్యం.. నమ్మలేని నిజాలు!

ప్రస్తుత కాలంలో ఎవరికి కదిపినా ఏదో ఒక అనారోగ్య సమస్య గురించి చెబుతూనే ఉంటున్నారు. షుగర్, బీపీ, అధిక బరువు, ఊబకాయం, థైరాయిడ్, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. లైఫ్ స్టైల్‌లో మారిన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల చాలా సమస్యలకు బైబై చెప్పొచ్చు. అంతే కాదు అనారోగ్య సమస్యలు త్వరగా మిమ్మల్ని ఎటాక్ చేయకుండా ఉంటాయి. ఇలా మీ ఆరోగ్యాన్ని పెంచడంలో.. మిల్లెట్స్ ఎంతో చక్కగా పని చేస్తాయి. ఈ మధ్య కాలంలో వీటిపై..

Pearl Millet: ఓ మై గాడ్.. సజ్జలతో చర్మ ఆరోగ్యం.. నమ్మలేని నిజాలు!
Pearl Millet
Follow us

|

Updated on: Sep 22, 2024 | 12:29 PM

ప్రస్తుత కాలంలో ఎవరికి కదిపినా ఏదో ఒక అనారోగ్య సమస్య గురించి చెబుతూనే ఉంటున్నారు. షుగర్, బీపీ, అధిక బరువు, ఊబకాయం, థైరాయిడ్, క్యాన్సర్ వంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. లైఫ్ స్టైల్‌లో మారిన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వల్ల చాలా సమస్యలకు బైబై చెప్పొచ్చు. అంతే కాదు అనారోగ్య సమస్యలు త్వరగా మిమ్మల్ని ఎటాక్ చేయకుండా ఉంటాయి. ఇలా మీ ఆరోగ్యాన్ని పెంచడంలో.. మిల్లెట్స్ ఎంతో చక్కగా పని చేస్తాయి. ఈ మధ్య కాలంలో వీటిపై అవగాహన చాలా పెరిగింది. మిల్లెట్స్‌లో సజ్జలు కూడా ఒకటి. చిరుతిళ్లు తినే బదులు సజ్జలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ సజ్జలలో లభిస్తాయి. సజ్జలు తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సజ్జలు ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలను కంట్రోల్ చేసి.. శరీర ఆరోగ్యాన్ని పెంచుతాయి. ఇలాంటి సజ్జలు తినడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటీస్ కంట్రోల్:

సజ్జలు తినడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. ఎందుకంటే ఇవి ట్రై గ్లిజరైడ్స్ స్థాయిలను కంట్రోల్ చేసి.. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి. డయాబెటీస్‌తో బాధ పడేవారు ప్రతి రోజూ మధ్యాహ్నం లేదా ఉదయం సజ్జలతో తాయరు చేసిన ఆహారం తీసుకోవడం వలన బెటర్ రిజల్ట్స్ ఉంటాయి.

చర్మం ఆరోగ్యం:

సజ్జలు తినడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యమే కాకుండా చర్మాన్ని కూడా అందంగా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. ఇందులో ఉండే ఫినాలిక్‌లు.. యాంటీ ఏజింగ్ ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిని తింటే యవ్వనంగా ఉంటారు.

ఇవి కూడా చదవండి

గుండె పదిలం:

సజ్జలు తినడం వల్ల బీపీ లెవల్స్ అనేవి సాధారణంగా ఉంటాయి. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్ అవుతుంది. అధిక బరువు తగ్గుతుంది. దీంతో గుండెపై పడే ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. అంతే కాకుండా ఇతర గుండె సమస్యలు కూడా తలెత్తకుండా చూస్తుంది. రక్త పోటు సమస్యను తగ్గిస్తుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

సజ్జలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ స్ట్రాంగ్‌గా ఉంటే.. ఎలాంటి రోగాలు త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి. ఆరోగ్యంగా ఉంటారు. అలసట, నీరసం వంటివి దూరమవుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..