Packet Milk: ప్యాకెట్ పాలను వాడుతున్నారా.. ఈ విషయాలు మీకోసమే!

సిటీలో ఉన్నా.. గ్రామాల్లో ఉన్నా ఇప్పుడు ప్యాకెట్ పాలు ఎక్కడైనా సులభంగా లభ్యమవుతున్నాయి. గ్రామాల్లో కూడా ప్యాకెట్ పాల వినియోగా బాగా పెరుగుతుంది. గేదె పాలు నేరుగా లభ్యమవుతున్నా.. చాలా మంది ప్యాకెట్ పాలు కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పాలను తాగడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ప్యాకెట్ పాలను మీరు కూడా వాడుతూ ఉన్నట్లయితే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ ప్యాకెట్ పాలతో టీ, కాఫీలు, పాలు తాగుతూ..

Packet Milk: ప్యాకెట్ పాలను వాడుతున్నారా.. ఈ విషయాలు మీకోసమే!
Packet Milk
Follow us

|

Updated on: Sep 22, 2024 | 12:06 PM

సిటీలో ఉన్నా.. గ్రామాల్లో ఉన్నా ఇప్పుడు ప్యాకెట్ పాలు ఎక్కడైనా సులభంగా లభ్యమవుతున్నాయి. గ్రామాల్లో కూడా ప్యాకెట్ పాల వినియోగా బాగా పెరుగుతుంది. గేదె పాలు నేరుగా లభ్యమవుతున్నా.. చాలా మంది ప్యాకెట్ పాలు కొనేందుకే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ పాలను తాగడం వల్ల శరీరానికి అనేక పోషకాలు లభిస్తాయి. ప్యాకెట్ పాలను మీరు కూడా వాడుతూ ఉన్నట్లయితే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోండి. ఈ ప్యాకెట్ పాలతో టీ, కాఫీలు, పాలు తాగుతూ ఉంటారు. అయితే ఈ పాలను ఎక్కువగా తాగేవాళ్లు కొన్ని ముఖ్యమైన విషయాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. చాలా మంది ఈ పాలను గంటల తరబడి మరగబెడుతూ ఉంటారు. ఇలా ఎక్కువ సేపు మరగబెట్టడం వల్ల అందులోని పోషకాలన్నీ పోతాయట. కాబట్టి ప్యాకెట్ పాలను ఎక్కువ సేపు మరిగించి తాగడం వల్ల శరీరానికి కూడా నష్టాలు తొలగుతాయట. మరి వాటి ఎఫెక్ట్స్ ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

పోషకాలు మాయం:

పాలను ఎక్కువ సేపు మరిగించి తాగడం చాలా మంచిదని అందరూ అనుకుంటారు. కానీ ఇలా మరిగించి తాగడం వల్ల అందులోని పోషకాలు పోతాయి. ముఖ్యంగా బలంగా, దృఢంగా ఉండటం కోసం పాలను తాగుతూ ఉంటాం. పాలను తాగడం వల్ల ఎముకలు, కండరాలు బలంగా, దృఢంగా ఉంటాయి. పిల్లలు ప్రతి రోజూ పాలు తాగడం వల్ల వారిలో చక్కటి ఎదుగుదల కనిపిస్తాయి. పోషకాలు చక్కగా అందుతాయి. కానీ పాలు ఎక్కువగా మరిగించి ఇవ్వడం వల్ల అందులోని పోషకాలు అన్నీ పోతాయి.

వివిధ రకాల రోగాలు వస్తాయి:

ప్యాక్ చేసిన పాలనే పాశ్చరైజ్డ్ పాలు అలాంటరు. సాధారణంగా పాలు ప్యాక్ చేసేటప్పుడు 71 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. మళ్లీ వాటిని సున్నా డిగ్రీల వద్ద కూల్ చేస్తారు. ఇలాంటి పాలను మళ్లీ ఎక్కువగా మరిగించి తీసుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. పోషకాలు అందకపోగా.. సమస్యలు కూడా తలెత్తవచ్చు.

ఇవి కూడా చదవండి

ప్యాకెట్ పాలు వాడేటప్పుడు జాగ్రత్త..

ప్యాకెట్ పాలు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కొనే ప్యాకెట్ మీదనే అన్ని రకాల ఇన్ స్ట్రెక్షన్స్ ఇస్తారు. ఒక్కొసారి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన పాలను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇలాంటి పాలు తాగితే పలు రాకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి పాల ప్యాకెట్లు వాడేటప్పుడు ఎక్స్‌పైరీ డేట్ అన్నీ పరిశీలించి తీసుకోవాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..