Heart Attack in Children’s: చిన్నపిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..

హార్ట్ ఎటాక్ అనేది కేవలం పెద్ద వారిలోనే కాదు చిన్న పిల్లలకు కూడా ఎటాక్ చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఎంతో మంది చిన్న పిల్లలు సైతం గుండె పోటుతో మరణిస్తున్నారు. పిల్లలో హార్ట్ ఎటాక్ రావడానికి ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వీటితో పేరెంట్స్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి..

Heart Attack in Children's: చిన్నపిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
Heart Attack In Children's
Follow us
Chinni Enni

|

Updated on: Jan 09, 2025 | 1:53 PM

గుండె పోటుతో చనిపోయే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో పెద్దలే కాకుండా చిన్న పిల్లలు సైతం గుండె నొప్పితో మరణిస్తున్నారు. స్కూల్, కాలేజీల్లో, ఆడుకునేటప్పుడు, తినేటప్పుడు ఇలా చాలా మంది పిల్లలు చనిపోతున్నారు. చిన్న పిల్లల్లో గుండె పోటు వచ్చే ముందు కొన్ని రకాల లక్షణాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. కానీ పెద్దలు వాటిని సరిగా గమనించడం లేదు. పెద్దలు కూడా పిల్లల ఆరోగ్యంపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. పెద్దల్లో వచ్చే లక్షణాలు చిన్న పిల్లల్లో వచ్చే లక్షణాలు అనేవి వేరుగా ఉంటాయి. ముఖ్యంగా పదేళ్లు పూర్తిగా నిండని పిల్లలు కూడా గుండె పోటుతో మరణించడం అనేది ఈ మధ్య కాలంలో ఎంతో మందిని కలిచి వేస్తుంది. పిల్లల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలో కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అలెర్ట్ అవ్వాలని సూచిస్తున్నారు.

పిల్లల్లో కనిపించే హార్ట్ ఎటాక్ లక్షణాలు:

అకస్మాత్తుగా స్పృహ కోల్పోవడం, అలసట, ఛాతీలో అసౌకర్యం, కళ్లు తిరగడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండెలో దడ, చెమటలు ఎక్కువగా పట్టడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అలెర్ట్ అవ్వాలి. కేవలం తల్లిదండ్రులే కాకుండా స్కూల్‌లోని ఉపాధ్యాయులు సైతం పిల్లలు ఎలా ఉన్నారన్నది గమనించాలని వైద్యులు సూచిస్తున్నారు.

పిల్లలో హార్ట్ ఎటాక్ రాకుండా ఉండేందుకు చిట్కాలు:

1. పిల్లల్లో గుండె పోటు రాకుండా ఉండేందుకు కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లల్ని కాపాడుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

2. పిల్లలు తీసుకునే ఆహారంపై జాగ్రత్త వహించాలి. పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ తినేందుకు ఇష్ట పడుతూ ఉంటారు. కాబట్టి ఆరోగ్యమైన ఆహారం పెట్టండి.

3. ప్రతి రోజూ వాకింగ్ లేదా ఇతర శారీరక శ్రమ చేసేలా చూసుకోండి. ఇది వారిని ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.

4. ఆహారంలో ఫైబర్, విటమిన్లు, ప్రోటీన్, ఖనిజాలు ఉండేలా చూడండి. ఇది పోషకాహార లోపాన్ని తగ్గిస్తుంది. పిల్లలకు తక్షణ శక్తిని ఇస్తుంది.

5. పిల్లలు ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉండేలా చూడాలి. కాబట్టి పానీయాలు, మంచినీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు కూడా ఇస్తూ ఉండాలి.

6. వాళ్లు నీరసంగా ఉంటే.. వెంటనే వైద్యుల్ని సంప్రదించి.. సరైన చికిత్స చేయించాలి. రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని ఇవ్వండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)