AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dieting Tips: డైటింగ్ చేస్తున్నారా?.. మీ డైట్‌లో ఈ ఫ్రూట్‌ కచ్చితంగా ఉండాల్సిందే.. ప్రయోజనాలు తెలిస్తే..

ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతున్నారు. బరువు తగ్గాలని జిమ్‌కు వెళ్తున్నారు. డైటింగ్ చేస్తున్నారు. కానీ వీటిని పాటించే క్రమంలో వీళ్లు చేసే కొన్ని తప్పులు, తప్పుడు ఆహార ఎంపికలు.. వాళ్లకు త్వరగా ప్రయోజనాలు అందించలేవు. కాబట్టి డైటింగ్ చేసేటప్పుడు.. డైట్‌లో ఉండాల్సిన ఆహారాల గురించి తెసుకోవడం తప్పని సరి.. కాబట్టి డైటింగ్‌ చేసే వాళ్లు.. డైట్‌ చేర్చుకోవాల్సిన ఒక ముఖ్యమైన పండు గురించి ఇప్పడు మనం తెలుసుకుంది.

Dieting Tips: డైటింగ్ చేస్తున్నారా?.. మీ డైట్‌లో ఈ ఫ్రూట్‌ కచ్చితంగా ఉండాల్సిందే.. ప్రయోజనాలు తెలిస్తే..
Dieting Tips
Anand T
|

Updated on: Nov 22, 2025 | 1:08 PM

Share

డైటింగ్‌ చేస్తూ.. బరువు తగ్గాలనుకునే వారకి డ్రాగన్‌ ఫ్రూట్ మంచి ఎంపిక. ఇటీవలి కాలంలో ఈ పండు వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఇది మార్కెట్‌లో విరివిగా లభిస్తుంది. డైట్‌ చేసే ప్రతి ఒక్కరూ దీనిని తినాలి అనుకుంటారు. ఎందుకంటే దీనిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్లు సి, బి2 పుష్కలంగా ఉంటాయి. దానితో పాటు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్య సమస్యల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అందుకే మనం తీసుకునే ఆహారంలో డ్రాగన్ ఫ్రూట్‌ను చేర్చుకోవడం చాలా ముఖ్యం. డ్రాగన్ ఫ్రూట్‌లో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నష్టం నుండి రక్షించడంలో సహాయపడతాయి. ఇది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

డ్రాగన్‌ ఫ్రూట్‌ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

గుండె ఆరోగ్యం మెరుగుపడడం: డ్రాగన్ ఫ్రూట్‌లోని ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వాపును తగ్గించడం, రక్త లిపిడ్ ప్రొఫైల్‌లను మెరుగుపరచడం చేస్తుంది. దీని ద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు డ్రాగన్ ఫ్రూట్ రక్తంలో చక్కెర నియంత్రణపై ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇది కూడా గుండె సమస్యల తగ్గుదలకు తోడ్పడుతుంది

మలబద్ధకం సమస్యకు చెక్: డ్రాగన్ ఫ్రూట్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి, మలబద్ధకాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా, ఈ పండులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన సమ్మేళనాలు కూడా ఉన్నాయి. ఇవి వాపును తగ్గించడంలో, ఆర్థరైటిస్‌తో సంబంధం ఉన్న లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

చర్మ ఆరోగ్యానికి మేలు: డ్రాగన్ ఫ్రూట్‌లోని విటమిన్ సి, ఇతర యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అంతే కాదు, అవి సాధారణ జలుబు వంటి సీజనల్‌ రోగాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడటానికి, వృద్ధాప్యాన్ని ఆలస్యం చేయడానికి, ఆరోగ్యకరమైన చర్మాన్ని ప్రోత్సహించడానికి సహాయపడతాయి.

బరువు తగ్గడం: డ్రాగన్‌ ఫ్రూట్‌ బరువును తగ్గించేందుకు, నియంత్రణలో ఉంచేందుకు తోల్పడుతుంది. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి అలాగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, అతిగా తినడాన్ని తగ్గిస్తుంది, మొత్తం కేలరీల వినియోగాన్ని తగ్గిస్తుంది. దానితో ఇది శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. కాబట్టి ఈ ఫ్రూట్‌ను కచ్చితంగా మీ డైట్‌లో చేర్చుకోండని నిపుణులు చెబుతున్నారు.

NOTE: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని మేము దృవీకరించట్లేదు.. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.