Double Chin: డబుల్ చిన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు..

అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అందంగా ఉంటే.. మరింత ఆత్మ విశ్వాసంగా ముందుకు వెళ్తామని అనుకుంటారు. అందం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు మన శరీరంలో జరిగే కొన్ని పరిణామాలు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా బ్యూటీ రంగంలో ఉండేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది డబుల్ చిన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిని దాచడానికి తెగ కష్ట పడిపోతూ..

Double Chin: డబుల్ చిన్‌తో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా ఈజీగా తగ్గించుకోవచ్చు..
Double Chin 1
Follow us

|

Updated on: Jun 22, 2024 | 2:13 PM

అందంగా ఉండాలని అందరికీ ఉంటుంది. అందంగా ఉంటే.. మరింత ఆత్మ విశ్వాసంగా ముందుకు వెళ్తామని అనుకుంటారు. అందం కోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సార్లు మన శరీరంలో జరిగే కొన్ని పరిణామాలు ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ముఖ్యంగా బ్యూటీ రంగంలో ఉండేవారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది డబుల్ చిన్‌తో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీటిని దాచడానికి తెగ కష్ట పడిపోతూ ఉంటారు. డబుల్ చిన్ కారణంగా చూసేందుకు అంతగా బాగుండదు. దీన్ని కవర్ చేసుకోవడానికి చాలా మంది రకరకాల చికిత్సలు చేయించుకుంటారు. ఈ డబుల్ చిన్ కారణంగా చాలా మంది బరువు పెరగడం జరుగుతుంది. పలు రకాల జన్యు లోపాల కారణంగా కూడా ఈ డబుల్ చిన్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు చెప్పే ఈ చిన్న టెక్నిక్స్‌తో కూడా డబుల్ చిన్‌ తగ్గంచుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

చూయింగ్ గమ్ నమలడం:

చూయింగ్ గమ్ నమలడం వల్ల కూడా డబుల్ చిన్ సమస్య కంట్రోల్ అవుతుంది. చూయింగ్ గమ్‌ని ప్రతి రోజూ గంట సేపు నమలడం వల్ల దవడల దగ్గర పేరుకున్న కొవ్వు ఈజీగా కరుగుతుంది. అంతే కాకుండా మంచి ముఖ వర్చస్సును సొంతం చేసుకోవచ్చు. షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్స్ అయితే ఆరోగ్యానికి మంచిది.

స్ట్రెచ్ చేయడం:

గడ్డాన్ని స్ట్రెచ్ చేయడం వల్ల కూడా డబుల్ చిన్ సమస్యను తగ్గించు కోవచ్చు. ఈ వర్క్ అవుట్ వల్ల మంచి ఫలితం ఉంటుంది. స్ట్రెచ్ చేయడం వల్ల మెడ కండరాలకు మంచి వ్యాయామం లభిస్తుంది. తలని పైకి ఎత్తి.. నోటిలోని నాలుకను లోపలికి లాగాలి. ఇలా ప్రతి రోజూ 5 నుంచి 6 సార్లు చేస్తే మంచిది.

ఇవి కూడా చదవండి

నాలుకను బయట పెట్టడం:

డబుల్ చిన్ తగ్గించుకోవడానికి ఈ చిట్కా కూడా చక్కగా హెల్ప్ చేస్తుంది. నాలుకను బయట పెట్టడం వల్ల డబుల్ చిన్ తగ్గుతుంది. వీలైనంత వరకు నాలుకను చాచి బయట పెట్టాలి. ఇలా 10 సెకన్లు ఉంచాలి. ఇలా 6 నుంచి 7 సార్లు చేస్తూ ఉండాలి. ఇది కూడా ఓ యోగా ప్రక్రియే.

నెక్ రౌండ్:

మెడి రౌండ్‌గా తిప్పడం వల్ల కూడా డబుల్ చిన్ సమస్యను తగ్గించు కోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మెడ దగ్గర ఉన్న ఫ్యాట్ సైతం కరుగుతుంది. ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చొని.. మీ తలను ఛాతీ వరకు దించుకోవాలి. ఇప్పుడు తలను చుట్టూ తిప్పాలి. ఐదు సెకన్లు చేస్తే చాలు. రెండు, మూడు సార్లు చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
చిమ్మచీకట్లో నల్లటి ఆకారాలు.. ఏంటని దగ్గరకెళ్లి చూడగా..
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఏరా.! మీరు మారరా.? ఇతడు ఏం చేశాడో తెలిస్తే
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
ఇంకా స్పేస్‌లోనే సునీతా విలియమ్స్ తిరిగొచ్చేదెప్పుడు.?
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
దారుణం.. మిస్టర్ తెలంగాణ సోహైల్ మృతి. బైక్‌పై వెళ్తూ..
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
EPFO కీలక అప్‌డేట్‌.. ఫైనల్‌ సెటిల్‌మెంట్‌ చేసుకున్న వారికి ఆఫర్.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
3.5 ఎకరాల్లో ఒక్కటే మర్రి చెట్టు.. శతాబ్దాల చెట్టుకు పునరుజ్జీవం.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
అండమాన్‌లో తెలుగు వారిపై లాఠీ చార్జ్.. పలువురికి గాయాలు.
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌గా ఇవి తీసుకుంటే అలసట దూరం., మీ గుండె పదిలం.!
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
భాగ్యనగరంలో భారీ వర్షం.. వరదలో కారు ఎలా కొట్టుకుపోతుందో చూడండి
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..
ప్రేమ పేరుతో వేధింపులు యువతి ఆత్మహత్య.! ఫొటోస్ పెడతానంటూ..