PKL 2024: తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..మోహిత్ పోరాడినా పుణెరి పల్టాన్‌కు తప్పని ఓటమి

PKL season 11: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో తమిళ్ తలైవాస్ వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. రెండు విజయాలతో జోరు మీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ కు చెక్ పెట్టింది. హైదరాబాద్‌లో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 35–30 తేడాతో పుణెరి పల్టాన్‌ను ఓడించింది.

PKL 2024: తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..మోహిత్ పోరాడినా పుణెరి పల్టాన్‌కు తప్పని ఓటమి
Tamil Thalaivas Beat Puneri Paltan
Follow us

|

Updated on: Oct 23, 2024 | 10:24 PM

హైదరాబాద్, అక్టోబర్ 23: ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌లో తమిళ్ తలైవాస్ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. రెండు విజయాలతో జోరు మీదున్న డిఫెండింగ్ చాంపియన్ పుణెరి పల్టాన్ కు చెక్ పెట్టింది. బుధవారం రాత్రి ఇక్కడి  జీఎంసీ బాలయోగి ఇండోర్‌‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తలైవాస్ 35–30 తేడాతో పుణెరి పల్టాన్‌ను ఓడించింది. తలైవాస్ తరఫున రైడర్లు నరేందర్ కండోలా 9, సచిన్ 8 పాయింట్లతో ఆకట్టుకున్నారు. డిఫెండర్ నితేశ్ కుమార్ (5) హైఫైవ్ సాధించాడు. పుణెరి జట్టులో రైడర్ మోహిత్ గోయత్ (13) ఒంటరి పోరాటం చేశాడు. ఈ మ్యాచ్‌లో పుణెరి పల్టాన్‌ను తలైవాస్ రెండుసార్లు ఆలౌట్ చేసింది.

ఈ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ ఆరంభం నుంచి జోరు చూపెట్టింది. నరేందర్ వరుసగా రెండు టచ్ పాయింట్లు రాబట్టగా, పంకజ్‌, అస్లాంను తలైవాస్ డిఫెండర్లు ట్యాకిల్ చేయడంతో ఆ జట్టు 4–0 ఆధిక్యంతో ఆటను ఆరంభించింది. అయితే, సచిన్‌ను సూపర్‌‌ ట్యాకిల్ చేసిన పుణెరి పల్టాన్ 5–6తో ముందుకొచ్చింది. మోహిత్ వరుసగా రెండు డబుల్ పాయింట్ల రైడ్లతో ఆకట్టుకోగా.. అస్లాం కూడా డబుల్ పాయింట్ రైడ్ చేయడంతో పుణెరి 10–11తో నిలిచింది. కానీ, కోర్టులో మిగిలిన అస్లాంను ట్యాకిల్ చేసిన తలైవాస్ 8వ నిమిషంలో పుణెరి ఆలౌట్ చేసి 14–11తో ముందంజ వేసింది. ఇక్కడి నుంచి పుణెరి డిఫెన్స్‌లో మెరుగైనా తమిళ జట్టు తన ఆధిక్యాన్ని కాపాడుకుంది. డూ ఆర్ డై రైడ్ కి వచ్చిన మోహిత్‌ను ట్యాకిల్ చేసి 19–15తో తొలి అర్ధభాగాన్ని ముగించింది.

Tamil Thalaivas Beat Puneri Paltan1

Tamil Thalaivas Beat Puneri Paltan

ద్వితియార్థం మొదలైన వెంటనే సచిన్‌ ఓ టచ్ పాయింట్ తీసుకురాగా, ఆకాశ్‌ను నితేశ్‌ ట్యాకిల్‌ చేశాడు. డుబ్కితో ఎస్కేప్ అయ్యే ప్రయత్నం చేసిన అస్లాంను తలైవాస్ డిఫెండర్లంతా నిలువరించారు. దాంతో తలైవాస్ 22–15తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది.ఈ దశలో పుణెరి డిఫెండర్లు సత్తా చాటారు. నరేందర్‌‌ను సూపర్ ట్యాకిల్‌ చేసిన పుణెరి మరోసారి అతడిని నిలువరించింది. సాహిల్‌ ప్రత్యర్థికి దొరికిపోయినా సచిన్‌ను సూపర్‌‌ ట్యాకిల్ చేసిన పల్టాన్‌ డిఫెండర్లు 21–24తో అంతరాన్ని తగ్గించారు. కానీ, తలైవాస్ ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. నరేందర్‌‌ మళ్లీ రైడింగ్‌లో జోరు పెంచగా.. డిఫెండర్లు కూడా విజృంభించారు. ఈ క్రమంలో పుణెరిని రెండోసారి ఆలౌట్‌ చేసిన తలైవాస్ 30–22తో తన ఆధిక్యాన్ని భారీగా పెంచుకుంది. చివరి నిమిషాల్లో పుణెరి డిఫెండర్లు సూపర్ ట్యాకిల్స్‌ తో ఆకట్టుకోవడంతో ఓటమి అంతరం తగ్గింది.

Tamil Thalaivas Beat Puneri Paltan2

Tamil Thalaivas Beat Puneri Paltan

Tamil Thalaivas Beat Puneri Paltan3

Tamil Thalaivas Beat Puneri Paltan

Tamil Thalaivas Beat Puneri Paltan5

Tamil Thalaivas Beat Puneri Paltan

Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
Horoscope Today: వారికి అన్ని వైపుల నుంచి ఆదాయం..
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
కూటమి పొత్తు ప్రతిపాదన ముందు ఎవరు తీసుకొచ్చారంటే? సీఎం చంద్రబాబు
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
AUSతో టెస్ట్ సిరీస్.. భారత జట్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
'జైలులో ఫుడ్ అసలు తినలేకపోయా.. నరకం అనుభవించా': జానీ మాస్టర్
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
పుణెరి పల్టాన్‌ తీన్‌మార్‌.. బెంగళూర్‌ బుల్స్‌కు నాల్గో ఓటమి
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
ఉత్కంఠ పోరులో తలైవాస్‌పై పట్నా పైరేట్స్‌ విజయం..
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
అరెస్టైన తొలి రోజు రాత్రి.. బాలయ్య అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
నువ్వు మా రాజువు కాదు.. బ్రిటన్‌ రాజుకు బిగ్‌ షాక్‌.! ఆదివాసీ..
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
చికెన్‌ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
కొండచిలువకు ప్రాణం పోశారు.! సాగర్ జలాశయం లో భారీ కొండ చిలువ..

అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఉద్యోగానికి సరిపోతారు.. అందుకే రిజెక్ట్‌ అయ్యారు! అవాక్..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
ఓర్నీ.. తలకు గాయమైతే.. పొత్తి కడుపుపై సర్జరీ గుర్తులు.! వీడియో..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
భార్య చేతిలో రూ.26 లక్షల బ్యాగ్‌.! సొరంగంలో హమాస్ నేత సిన్వర్..
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
జైల్లో లారెన్స్‌ బిష్ణోయ్‌ ఖర్చులకు ఏటా రూ.40 లక్షలు.!
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
ప్రధానికి రూ.100 పంపిన గిరిజన మహిళ.. ఎందుకంటే.? వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో
12 ఏళ్లుగా పొత్తికడుపు నొప్పి.. ఎక్స్‌రేలో షాకింగ్‌ సీన్‌! వీడియో