ఇదేం చెత్త బ్యాటింగ్ మావా.! సున్నాకి ఆరుగురు, 1 పరుగుకు 8 వికెట్లు..

సున్నాకి ఆరుగు బ్యాటర్లు డకౌట్.. 1 పరుగుకే 8 వికెట్లు పడ్డాయి. వన్డే క్రికెట్‌లో ఇదొక చెత్త బ్యాటింగ్ పెర్ఫార్మన్స్.. ఇంతకీ ఈ టీం ఏంటి.? ఏ డొమెస్టిక్ టోర్నీలో జరిగిందో ఇప్పుడు తెలుసుకుందామా..

ఇదేం చెత్త బ్యాటింగ్ మావా.! సున్నాకి ఆరుగురు, 1 పరుగుకు 8 వికెట్లు..
Cricket
Follow us

|

Updated on: Oct 25, 2024 | 6:34 PM

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో డొమెస్టిక్ వన్డే టోర్నీ జరుగుతోంది. ఈ దేశవాళీ టోర్నమెంట్‌లోని 10వ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా, టాస్మానియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్మానియా జట్టు 7 వికెట్ల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. ఇందులో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టర్న్ ఆస్ట్రేలియా జట్టు 20.1 ఓవర్లలో కేవలం 53 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక ఈ స్వల్ప లక్ష్యాన్ని టాస్మానియా జట్టు 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 8.3 ఓవర్లలో చేధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా తొలి వికెట్‌కు ఆరోన్ హార్డీ(7), డార్సీ షార్ట్(22) 11 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీని తర్వాత కెమెరాన్ బాన్‌క్రాఫ్ట్, షార్ట్ రెండో వికెట్‌కు 33 పరుగుల పార్టనర్‌షిప్ అందించారు. ఇక జట్టు స్కోరు 52 పరుగులకు చేరుకునేసరికి కెమెరాన్ బాన్‌క్రాఫ్ట్ మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు.

అనంతరం వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. బాన్‌క్రాఫ్ట్ తర్వాత జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ ఖాతా తెరవలేకపోయారు. జోష్ ఇంగ్లీష్ ఒక పరుగుతో పాటు, కెప్టెన్ ఆష్టన్ టర్నర్, కూపర్ కొన్నోలీ, హిల్టన్ కార్ట్‌రైట్, ఆస్టన్ అగర్, రిచర్డ్‌సన్, జోయెల్ పారిస్, లాన్స్ మోరిస్.. ఇలా అందరూ ఖాతా తెరవలేకపోయారు.

ఇవి కూడా చదవండి

టాస్మానియా తరపున బౌలర్ వెబ్‌స్టర్ 17 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టగా.. బిల్లీ స్టాన్‌లేక్ 3 వికెట్లు తీశాడు. ప్రత్యర్ధి జట్టు ఒక్క పరుగుకే 8 వికెట్లు కోల్పోయినప్పటికీ.. టాస్మానియా జట్టులోని ఏ బౌలర్ కూడా హ్యాట్రిక్ పూర్తి చేయలేకపోయారు. మరోవైపు 53 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని టాస్మానియా జట్టు సునాయాసంగా చేధించింది. మిచెల్ ఓవెన్ 29 పరుగులతో.. మాథ్యూ వేడ్ 21 పరుగులతో విజయంలో కీలక పాత్రలు పోషించారు.

ఇది చదవండి: పటాస్ మూవీలో ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు అందంతో మత్తెక్కిస్తోందిగా

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..