WTC Final: పుణె టెస్టులో ఓడిపోతే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుందా? లెక్కలివిగో

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా రెండుసార్లు ఫైనల్‌కు చేరుకుంది. అయితే రెండు సార్లు నిరాశే ఎదురైంది. తొలి ఫైనల్ లో న్యూజిలాండ్‌తో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత రెండో సీజన్‌లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం పాలైంది. ఇప్పుడు భారత జట్టు మూడోసారి ఫైనల్ చేరుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

WTC Final: పుణె టెస్టులో ఓడిపోతే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుందా? లెక్కలివిగో
India Vs New Zealand
Follow us

|

Updated on: Oct 25, 2024 | 9:19 PM

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఓడిన టీమిండియా రెండో మ్యాచ్ లోనూ పరాజయం అంచున నిలిచింది. మ్యాచ్ ఇంకా ముగియనప్పటికీ న్యూజిలాండ్ జోరు చూస్తుంటే వరుసగా రెండో విజయం సాధించేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆజట్టు ఆధిక్యం 300కు పైగానే ఉంది. ఆ జట్టు చేతిలో ఇంకా 5 వికెట్లు మిగిలి ఉన్నాయి. శనివారం నాటికి వారు 400 పరుగులకు చేరుకునేలా కనిపిస్తోంది. కాబట్టి నాలుగో ఇన్నింగ్స్ లో 400 పరుగుల పెద్ద సవాలును సాధించడం అనుకున్నంత సులభం కాదు. అందుకే టీమిండియాకు మరో ఓటమి తప్పదని క్రీడా ప్రేమికుల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ ఈ మ్యాచ్ లోనూ భారత్ పరాజయం పాలైతే సిరీస్‌ను కూడా చేజార్చుకోనుంది. అలాగే, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు సంబంధించిన లెక్కలు కూడా మారనున్నాయి. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 12 మ్యాచ్‌ల తర్వాత భారత్ విజయాల శాతం 68.06 శాతంగా ఉంది. 62.50 విజయ శాతంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, 55.56 విజయ శాతంతో శ్రీలంక మూడో స్థానంలో ఉంది.

న్యూజిలాండ్‌తో టెస్ట్ మ్యాచ్‌కు ముందు, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ లో భారత్ కు బెర్తు ఖాయమనిపించింది. అయితే బెంగళూరు టెస్టులో ఓటమితో లెక్కలు మారిపోయా యి. ఇప్పుడు న్యూజిలాండ్‌తో జరిగే రెండో టెస్టులో భారత్ ఓడిపోతే గెలుపు శాతం 68.06 నుంచి 62.82కి పడిపోతుంది. కాబట్టి డబ్ల్యూటీసీ ఫైనల్ ఈక్వెషన్స్ సంక్లిష్టంగా మారిపోతాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌ లో భారత్‌ మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అందులో ఐదు మ్యాచ్‌లు ఆస్ట్రేలియాతో జరగనున్నాయి. ఫైనల్‌కు చేరుకోవాలంటే భారత్ ఇప్పుడు మిగిలిన ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలవాలి. న్యూజిలాండ్‌తో మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లు ఉన్నాయి. మిగతా జట్ల ప్రదర్శనపై నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపు సమీకరణం ఆధారపడి ఉండదు. నాలుగు మ్యాచ్‌లు గెలవలేకపోతే అవతలి జట్టు ఆటతీరును చూడాల్సిందే. ప్రపంచ టెస్టు సైకిల్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో శ్రీలంక ఆడనుంది. ఈ సిరీస్‌పై భారత్‌ ఫైనల్ బెర్తు ఖరారు కానుంది.

ఇవి కూడా చదవండి

&

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ అప్డేటెడ్ పాయింట్ల పట్టిక..

nbsp;

పుణెలో ఓటమి అంచున టీమిండియా..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..