సెంచరీ, డబుల్ సెంచరీ.. ఇరగదీసిన బాలీవుడ్ సెలబ్రెటి కుమారుడు

TV9 Telugu

22 October 2024

మిజోరం తరపున ఆడుతున్న అగ్ని దేవ్ చోప్రా రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆరంభించాడు. సెంచరీ, డబుల్ సెంచరీలతో అదరగొట్టాడు.

సెంచరీ, డబుల్ సెంచరీ

అగ్నిదేవ్ చోప్రా అరుణాచల్‌పై తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో అజేయ డబుల్ సెంచరీ సాధించాడు. 

పరుగుల వర్షం

అగ్నిదేవ్ చోప్రా ఈ మ్యాచ్‌లో 51 ఫోర్లు, 5 సిక్సర్లతో 348 పరుగులు చేశాడు. 

348 పరుగులు చేశాడు

అగ్నిదేవ్ చోప్రా అద్భుత ఇన్నింగ్స్‌తో మిజోరం 267 పరుగుల భారీ తేడాతో అరుణాచల్ ప్రదేశ్‌ను ఓడించింది. 

జట్టు అద్భుత విజయం

అగ్ని దేవ్ చోప్రా ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత విధు వినోద్ చోప్రా కుమారుడు. 

అగ్ని విధు వినోద్ చోప్రా కుమారుడు

అగ్ని దేవ్ చోప్రా 8 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అతను ఇప్పటివరకు 7 సెంచరీలు చేశాడు.

అగ్ని దేవ్ చోప్రా కెరీర్

అగ్ని దేవ్ చోప్రా ఇప్పటివరకు 1367 పరుగులు చేశాడు. అతని సగటు 91.13గా నిలిచింది. ఆడిన ప్రతీ మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు.

90 కంటే ఎక్కువ సగటుతో

టీమ్ ఇండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌కి అగ్ని దేవ్ చోప్రా మంచి స్నేహితుడు. అతను ఇషాన్ కిషన్‌కి కూడా సన్నిహితుడు.

శుభ్‌మన్‌, ఇషాన్‌లకు బెస్ట్ ఫ్రెండ్