Chicken Biryani: చికెన్ బిర్యానీలో కప్ప.. ఎక్కడో కాదు..హైదరాబాద్‌లోనే.!
ఆకలితో ఆవురావురుమంటూ భోజనం చేద్దామని టేబుల్ ముందు కూర్చున్నారు విద్యార్ధులు. మెస్ సిబ్బంది వేడి వేడిగా చికెన్ బిర్యానీ వడ్డించారు. లొట్టలేసుకుంటూ తిందామని కూర్చున్న విద్యార్ధులకు చికెన్ బిర్యానీలో కప్ప కనిపించడంతో దెబ్బకు షాయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. ఈ షాకింగ్ ఘటన ప్రస్తుతం వైరల్‌గా మారింది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని త్రిపుల్ ఐటి విద్యార్థులకు వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కనిపించింది. కళ్ల ముందున్న ఆ దృశ్యం చూసి వాళ్లకు కడుపులోంచి దేవినట్లయింది. వెంటనే కప్పతో పాటే ఆ బిర్యానీ ప్లేటును అలాగే తీసుకెళ్లి మెస్ ఇంచార్జ్ కు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఆహారం సప్లై చేస్తున్న మెస్ నిర్వాహకుల తీరుపై ఆందోళనకు దిగారు.
గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో కదంబ మెస్‌లో భోజనం చేస్తుండగా ఓ విద్యార్థికి వడ్డించిన చికెన్ బిర్యానీలో కప్ప కనిపించడంతో విద్యార్థులంతా అసహనానికి గురయ్యారు. బిర్యానీలో వచ్చిన కప్ప కళేబరాన్ని ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. మెస్‌లో శుభ్రత పాటించడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు వడ్డించే ఆహారంలో పురుగులు, కప్పలు వస్తున్నాయని వాపోయారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ట్రిపుల్ మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌కు కూడా విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.