ప్రొ కబడ్డీ
ప్రస్తుతం ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్ అక్టోబర్ 18 నుంచి ప్రారంభమైంది. ప్రో కబడ్డీ లీగ్ (PKL) భారతీయ పురుషుల ప్రొఫెషనల్ కబడ్డీ లీగ్. ఇది 2014లో ప్రారంభించారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన కబడ్డీ లీగ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తర్వాత భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన రెండవ స్పోర్ట్స్ లీగ్‌గా పేరుగాంచింది. జైపూర్ పింక్ పాంథర్స్ PKL తొలి ఛాంపియన్‌గా నిలిచింది.
2006 ఆసియా గేమ్స్‌లో కబడ్డీ టోర్నమెంట్‌కు లభించిన ప్రజాదరణతో లీగ్ ప్రారంభం ప్రభావితమైంది. పోటీ ఫార్మాట్ IPL ద్వారా ప్రభావితమైంది. ప్రో కబడ్డీ లీగ్ ఫ్రాంచైజీ ఆధారిత మోడల్‌ను ఉపయోగిస్తుంది. దీని మొదటి సీజన్ 2014లో ఎనిమిది జట్లతో నిర్వహించనున్నారు. 2017, 2018–19 సీజన్ కోసం, ప్రో కబడ్డీ లీగ్ నాలుగు కొత్త జట్లను జోడించింది. 2019 సీజన్ నుంచి దాని రెగ్యులర్ డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌కు తిరిగి వచ్చింది.
ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం నుంచి ఏడు వేర్వేరు ఛాంపియన్‌లు ఉన్నారు. పాట్నా పైరేట్స్ వరుసగా మూడు సీజన్‌లలో మూడు సార్లు పోటీలో విజయం సాధించింది. బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్ గెలుచుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. జైపూర్ పింక్ పాంథర్స్ రెండుసార్లు గెలుపొందగా, యూ ముంబా, బెంగళూరు బుల్స్, బెంగాల్ వారియర్స్, దబాంగ్ ఢిల్లీ కెసి, పుణెరి పల్టాన్‌లు ఒక్కో టైటిల్‌ను గెలుచుకున్నాయి.