AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PKL 2024: హోరాహోరీ పోరులో టైటాన్స్‌దే పైచేయి.. తలైవాస్‌పై ఉత్కంఠ విజయం

Pro Kabaddi League, PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 35-34 తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్‌-8వ సీజన్‌ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం.

PKL 2024: హోరాహోరీ పోరులో టైటాన్స్‌దే పైచేయి.. తలైవాస్‌పై ఉత్కంఠ విజయం
Telugu Titans Beats Tamil Thalaivas
Janardhan Veluru
|

Updated on: Nov 06, 2024 | 10:34 PM

Share

హైదరాబాద్‌, నవంబర్‌ 6: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో మరోపోరు అభిమానులను కట్టిపడేసింది. గచ్చిబౌలి స్టేడియం వేదికగా బుధవారం హోరాహోరీగా సాగిన పోరులో తెలుగు టైటాన్స్‌ 35-34 తేడాతో తమిళ్‌ తలైవాస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. పీకేఎల్‌-8వ సీజన్‌ తర్వాత తలైవాస్‌పై టైటాన్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. టైటాన్స్‌ తరఫున స్టార్‌ రైడర్‌ పవన్‌ సెహ్రావత్‌ 12 పాయింట్లతో అదరగొట్టగా, అశిష్‌ నార్వల్‌(9), విజయ్‌ మాలిక్‌(4) ఆకట్టుకున్నారు. మరోవైపు తలైవాస్‌ జట్టులో సచిన్‌ 17 పాయింట్లతో టాప్‌స్కోరర్‌గా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. సచిన్‌కు తోడు నితీశ్‌కుమార్‌(4), నరేందర్‌(3) ఫర్వాలేదనిపించారు. పీకేఎల్‌లో 1000 పాయింట్ల క్లబ్‌లో సచిన్‌ తాజాగా చేరాడు. వరుసగా హ్యాట్రిక్‌ విజయంతో టైటాన్స్‌ 21 పాయింట్లతో 4వ స్థానంలోకి దూసుకురాగా, తలైవాస్‌ 21 పాయింట్లతో మూడులో ఉంది.

ఇరు జట్లు హోరాహోరీగా..

లీగ్‌ సాగుతున్న కొద్దీ జట్ల మధ్య పోరు నువ్వానేన్నా అన్నట్లు హోరాహోరీగా సాగుతున్నది. గత సీజన్‌లో అభిమానులను తీవ్రంగా నిరాశపరిచిన తెలుగు టైటాన్స్‌ ఈసారి అంచనాలకు అనుగుణంగా ముందుకెళుతున్నది. స్థానిక అభిమానుల మద్దతుతో ప్రత్యర్థి జట్లపై ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. లీగ్‌లో ప్లేఆఫ్స్‌కు సాధించాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో అన్ని జట్లు తుదికంటా పోరాడుతున్నాయి. ప్రతీ పాయింట్‌ను కీలకంగా భావిస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో తెలుగు టైటాన్స్‌, తమిళ్‌ తలైవాస్‌ మధ్య పోరులో తొలి అర్ధభాగం ఉత్కంఠగా సాగింది. తొలి 20 నిమిషాల ఆట ముగిసే సరికి టైటాన్స్‌ 20-17 తేడాతో తలైవాస్‌పై ఆధిక్యం ప్రదర్శించింది. స్టార్‌ రైడర్‌ పవన్‌ సెహ్రావత్‌ తనదైన జోరు కనబరుస్తూ టైటాన్స్‌ కీలక పాయింట్లు అందించాడు. తొలి రెండు రైడ్లలో అంతగా ఆకట్టుకోలేకపోయిన పవన్‌ ఆ తర్వాత జూలు విదిల్చాడు. మ్యాచ్‌ 18వ నిమిషంలో విజయ్‌ మాలిక్‌ రైడ్‌తో టైటాన్స్‌ పాయింట్ల వేట ప్రారంభించింది. మరో ఎండ్‌లో పవన్‌ కూడా జతకలువడంతో టైటాన్స్‌ టాప్‌గేర్‌లోకి దూసుకొచ్చింది. మ్యాచ్‌ 12వ నిమిషంలో హిమాంశు, రోనక్‌ ఇద్దరిని పవన్‌ ఔట్‌ చేయడం ద్వారా తలైవాస్‌ తొలిసార ఆలౌటై టైటాన్స్‌కు నాలుగు పాయింట్లు సమర్పించుకుంది. సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన సచిన్‌ 11వ నిమిషంలో కిషన్‌, అశిష్‌ను ఔట్‌ చేసి తలైవాస్‌ను పోటీలోకి తీసుకొచ్చాడు. ఇక్కణ్నుంచి పోటీ మరింత రంజుగా మారింది. 6వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వచ్చిన టైటాన్స్‌ రైడర్‌ అశిష్‌ నార్వల్‌..అభిషేక్‌ను ఔట్‌ చేసి పాయింట్‌ కొల్లగొట్టాడు. తొలి అర్ధభాగం మరో 4 నిమిషాల్లో ముగుస్తుందనగా రైడ్‌కు వెళ్లిన పవన్‌ను..నితీశ్‌కుమార్‌ సూపర్‌ ట్యాకిల్‌తో కట్టడి చేశాడు.

తలైవాస్‌పై టైటాన్స్ విజయం

పవన్‌, సచిన్‌ దూకుడు:

ఓవైపు టైటాన్స్‌ తరఫున పవన్‌, మరోవైపు తలైవాస్‌కు సచిన్‌ పాయింట్ల వేటలో తమదైన దూకుడు ప్రదర్శించారు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్‌ పక్కా అన్న రీతిలో దూసుకెళ్లారు. ప్రథమార్ధంలో తలైవాస్‌పై ఒకింత పైచేయి సాధించిన టైటాన్స్‌..కీలకమైన ద్వితీయార్ధంలో తడపబడింది. ఇదే అదనుగా తలైవాస్‌ తమ దాడులకు పదునుపెట్టింది. ఈ క్రమంలో మ్యాచ్‌ 14వ నిమిషంలో టైటాన్స్‌ ఆలౌటైంది. రెండు జట్ల రైడర్లు, డిఫెండర్లు తుదికంటా పోరాడటంతో మ్యాచ్‌ రసపట్టుగా సాగింది. దాదాపు ఆఖరి రైడ్‌కు వెళ్లిన సచిన్‌ ఔట్‌ కావడంతో తలైవాస్‌ గెలుపు ఆశలపై టైటాన్స్‌ నీళ్లు చల్లింది. మొత్తంగా పవన్‌, సచిన్‌ రైడింగ్‌ జోరు అభిమానులను కట్టిపడేసింది.

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?