KL Rahul: ఏంటయ్యా రాహుల్ ఇది.. ఇలాగైతే టీమ్‌లో ప్లేస్ కష్టమే.. ఆసీస్‌- ఎతో టెస్ట్ మ్యాచ్‌లోనూ..

ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా ఇండియా A వర్సెస్ ఆస్ట్రేలియా A జట్ల మధ్య అనధికారిక టెస్ట్ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎ జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా, టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ కూడా రంగంలోకి దిగాడు.

KL Rahul: ఏంటయ్యా రాహుల్ ఇది.. ఇలాగైతే టీమ్‌లో ప్లేస్ కష్టమే.. ఆసీస్‌- ఎతో టెస్ట్ మ్యాచ్‌లోనూ..
KL Rahul
Follow us
Basha Shek

|

Updated on: Nov 07, 2024 | 8:50 AM

ఇటీవల వరుస వైఫల్యాలతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్. దీంతో అతనికి మరింత ప్రాక్టీస్ కోసం ఇండియా ఏ జట్టు తరఫున ఆడాలని బీసీసీఐ ఆదేశించింది. ఈ క్రమంలోనేమెల్‌బోర్న్‌లో ఇండియా ఎ, ఆస్ట్రేలియా ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ బరిలోకి దిగాడు. కానీ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పిచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ ఎ తరఫున ఇన్నింగ్స్ ప్రారంభించిన కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ క్రీజులో నిలబడలేకపోయారు. అభిమన్యు ఈశ్వరన్ (0) డకౌట్ కాగా, కేఎల్ రాహుల్ 4 బంతుల్లో 1 ఫోర్ కొట్టి స్కాట్ బోలాండ్ కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. మూడో స్థానంలో వచ్చిన సాయి సుదర్శన్ (0) కూడా నిరాశపర్చాడు. అలాగే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ దశలో బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ 55 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేశాడు. కానీ మైఖేల్ నేసర్ వేసిన బంతిని మార్క్ చేయడంలో విఫలమవడంతో పడిక్కల్ కూడా వికెట్ కోల్పోయాడు. దీంతో 26 ఓవర్లు ముగిసే సరికి భారత్ ఎ జట్టు 5 వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేసింది.

రాహుల్‌కు అగ్ని పరీక్ష

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో విఫలమైన కేఎల్ రాహుల్, మిగిలిన రెండు మ్యాచ్‌లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోలేదు. అయితే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌కు రాహుల్ ఎంపికయ్యాడు. కానీ ఈ సిరీస్ ప్రారంభానికి ముందు, ఆస్ట్రేలియాలో జరుగుతున్న సిరీస్‌లో భారత్ ఎ జట్టుకు ఆడాలని రాహుల్‌కు బీసీసీఐ సూచించింది. దీని ప్రకారం, ఆస్ట్రేలియా A తో జరిగిన మ్యాచ్‌లో, KL రాహుల్ మొదటి ఇన్నింగ్స్‌లో విఫలమయ్యాడు. ఇదే పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తే, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌కు కూడా అతను రిజర్వ్ బెంచ్ కే పరిమితం కాక తప్పదు.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా A ప్లేయింగ్ 11:

మార్కస్ హారిస్, సామ్ కాన్స్టాస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, ఆలివర్ డేవిస్, జిమ్మీ పియర్సన్ (వికెట్ కీపర్), మైఖేల్ నేజర్, నాథన్ మెక్‌ఆండ్రూ, స్కాట్ బోలాండ్, కోరీ రోచియోలీ.

ఇండియా A ప్లేయింగ్ 11:

అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, ధ్రువ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ రెడ్డి, తనుష్, ఖలీల్ అహ్మద్, పర్షిద్ కృష్ణ, ముఖేష్ కుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!
రష్యా సైన్యంలో పని చేస్తున్న భారతీయుడు మృతి.. అసలు కథ ఇది!
మహాకుంభమేళా.. అఘోరాలు, నాగసాధువుల ఆశీర్వాదం కోసం భక్తుల పోటీ
మహాకుంభమేళా.. అఘోరాలు, నాగసాధువుల ఆశీర్వాదం కోసం భక్తుల పోటీ
కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే.
కుంభమేళాలో సాధువుకు ఆగ్రహం తెప్పించిన యూట్యూబర్..సీన్ కట్ చేస్తే.
కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నారా?..షాకింగ్ న్యూస్ మీకోసమే!
కూల్‌డ్రింక్స్‌ తాగుతున్నారా?..షాకింగ్ న్యూస్ మీకోసమే!
నార్త్ అమెరికాలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్‌ల సునామీ!
నార్త్ అమెరికాలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ కలెక్షన్‌ల సునామీ!
సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!
సంక్రాంతి పండుగ చేసుకోని ఏకైక గ్రామం.. ఆరోజు స్నానం కూడా చేయరట!
అంతరిక్షంలో ఉపగ్రహాల గ్రాండ్‌ షేక్‌హ్యాండ్‌ విజయవంతం
అంతరిక్షంలో ఉపగ్రహాల గ్రాండ్‌ షేక్‌హ్యాండ్‌ విజయవంతం
కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ పప్పులను దూరం పెట్టాలి!
కిడ్నీ సమస్య ఉన్నవారు ఈ పప్పులను దూరం పెట్టాలి!
AI తో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చా?
AI తో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చా?
ఏం యాక్టింగ్ చేశావే మొసలి..! మనుషులను తినేయడానికి మాస్టర్ ప్లాన్
ఏం యాక్టింగ్ చేశావే మొసలి..! మనుషులను తినేయడానికి మాస్టర్ ప్లాన్