PKL 2024: ఢిల్లీ ధమాకా.. తమిళ్‌ తలైవాస్‌పై ఘన విజయం

Pro Kabaddi League, PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో దబాంగ్‌ ఢిల్లీ కేసీ అదరగొట్టింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 39-26తో తమిళ్‌ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది. లీగ్‌లో తమ కంటే మెరుగైన స్థితిలో ఉన్న తలైవాస్‌పై ఢిల్లీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఢిల్లీ తరఫున అషు మాలిక్‌(12) మరోమారు సూపర్‌-10 ప్రదర్శనతో విజృంభిస్తే..

PKL 2024: ఢిల్లీ ధమాకా.. తమిళ్‌ తలైవాస్‌పై ఘన విజయం
Dabang Delhi Thrashes Tamil Thalaivas
Follow us
Janardhan Veluru

|

Updated on: Nov 08, 2024 | 10:27 PM

హైదరాబాద్‌, నవంబర్‌ 8: ప్రొ కబడ్డీ లీగ్‌(పీకేఎల్‌)లో దబాంగ్‌ ఢిల్లీ కేసీ అదరగొట్టింది. శుక్రవారం గచ్చిబౌలి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 39-26తో తమిళ్‌ తలైవాస్‌పై ఘన విజయం సాధించింది. లీగ్‌లో తమ కంటే మెరుగైన స్థితిలో ఉన్న తలైవాస్‌పై ఢిల్లీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఢిల్లీ తరఫున అషు మాలిక్‌(12) మరోమారు సూపర్‌-10 ప్రదర్శనతో విజృంభిస్తే..ఢిపెండర్లు యోగేశ్‌(7), అశిష్‌ మాలిక్‌(7), మను(5) రాణించారు. మరోవైపు అనూహ్య ఓటమి ఎదుర్కొన్న తలైవాస్‌ తరఫున నరేందర్‌(6), సచిన్‌(4), సాహిల్‌(4), మోయిన్‌(4) ఆకట్టుకున్నారు. ఈ విజయంతో దబాంగ్‌ ఢిల్లీ 24 పాయింట్లతో మూడో స్థానంలోకి వచ్చింది. తలైవాస్‌ మూడో ఓటమితో 5వ స్థానానికి పరిమితమైంది.

ఢిల్లీ దూకుడు:ప్రొ కబడ్డీ లీగ్‌లో రైవలరీ వీక్‌ రసవత్తరంగా సాగుతున్నది. లీగ్‌లో ముందంజ వేయాలంటే ప్రతీ మ్యాచ్‌ కీలకమైన నేపథ్యంలో ప్రతీ జట్టు తుదికంటా పోరాడుతున్నాయి. ఓవైపు ఢిల్లీ వరుస ఓటములతో సతమతమవుతుంటే మరోవైపు తమిళ్‌ తలైవాస్‌ ప్రయాణం పడుతూ లేస్తూ సాగుతున్నది. శుక్రవారం తమిళ్‌ తలైవాస్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ తమదైన దూకుడు కనబరిచింది. స్టార్‌ రైడర్‌ నవీన్‌ గైర్హాజరీలో అషు మాలిక్‌ ఆకట్టుకున్నాడు. మ్యాచ్‌ 17వ నిమిషంలో అషు మాలిక్‌ పాయింట్ల ఖాతా తెరిచాడు. మరోవైపు 14వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వెళ్లిన నరేందర్‌ను యోగేశ్‌ ఔట్‌ చేయడంతో ఢిల్లీకి పాయింట్‌ వచ్చింది. ఆ తర్వాత రైడ్లలో కూడా నరేందర్‌ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఇదే అదనుగా ఢిల్లీ తమ వ్యూహాలకు పదునుపెట్టింది. ఓవైపు రైడింగ్‌కు తోడు డిఫెన్స్‌తో తలైవాస్‌కు చెక్‌ పెడుతూ ప్రథమార్ధం ముగిసే సరికి ఢిల్లీ 16-10తో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.

అషు మాలిక్‌ విజృంభణ:

ప్రథమార్ధంలో పెద్దగా జోరు కనబర్చని ఢిల్లీ రైడర్‌ అషు మాలిక్‌..కీలకమైన ద్వితీయార్ధంలో పంజా విసిరాడు. రైడ్‌కు వెళ్లడం ఆలస్యం పాయింట్‌ పక్కా అన్న రీతిలో చెలరేగుతూ ఢిల్లీని ఆధిక్యంలో నిలుపడంలో కీలకమయ్యాడు. 20వ నిమిషంలో డూ ఆర్‌ డై రైడ్‌కు వెళ్లిన మను..అమిఈర్‌, అనూజ్‌ను ఔట్‌ చేసి ఢిల్లీకి రెండు పాయింట్లు అందించాడు. ఈ క్రమంలో 18వ నిమిషంలో అషు మాలిక్‌..సచిన్‌ను ఔట్‌ చేయడంతో తలైవాస్‌ తొలిసారి ఆలౌటైంది. ఓవైపు రైడింగ్‌లో అషు మాలిక్‌ అదరగొడితే డిఫెన్స్‌లో యోగేశ్‌, అశిష్‌ మాలిక్‌..తలైవాస్‌ పనిపట్టారు. ఎక్కడా పట్టు వదలకుండా పాయింట్ల వేటలో తలైవాస్‌పై ఢిల్లీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తలైవాస్‌ తరఫున నరేందర్‌, సచిన్‌, సాహిల్‌ రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.

ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!
బరువు పెరగమన్న అభిమాని.. ఇచ్చిపడేసిన సమంత.!