Appadam: అప్పడాలు.. తెగ లాగించేస్తున్నారా.? అయితే, ఇది తెలుసుకోండి..!
కరకరలాడే అప్పడాలు అంటే అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. కొందరికి భోజనంలో అప్పడాలు ఉండి తీరాల్సిందే. వీటిని స్నాక్స్‌గా కూడా తింటారు. అయితే ఈ అప్పడాల వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. వీటిలో పైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందంటున్నారు నిపుణులు. అప్పడాల్లో కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు, కొవ్వులు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
ఈ అప్పడాలను భోజనంతో పాటు తినడం వల్ల శరీరంలో మేలు చేసే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది పూర్తిగా గ్లూటెన్ రహితం కూడా. కార్బోహైడ్రేట్లు, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, ఇనుము లాంటి పోషకాలు అప్పడాల్లో పుష్కలంగా లభిస్తాయి. అప్పడాలలో తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు కూడా తమ ఆహారంలో అప్పడాలను చేర్చుకోవచ్చు. జీర్ణక్రియ ప్రక్రియను సులభతరం చేయడం ద్వారా జీర్ణ ఎంజైమ్‌లను ఉత్పత్తి చేస్తుంది. ప్రోటీన్స్ కూడా అధికం. అలెర్జీలు ఉన్నప్పటికీ, అప్పడాలు తినడం సురక్షితం అనే చెప్పాలి. అన్ని వయసుల వారు, షుగర్ వ్యాధి ఉన్నవారు వైద్యుల సలహా మేరకు తినవచ్చు.
అప్పడాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. కంటి సంబంధిత ఆరోగ్య రుగ్మతలు, చెవికి సంబంధించిన వ్యాధులను కూడా అప్పడం తగ్గిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇందులో ఐరన్, కాల్షియం అధికంగా ఉంటాయి. అప్పడాలు గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా జ్వరంలో ఏమీ తినాలనిపించదు. ఆకలి వేయదు. అలాంటప్పుడు వేయించిన, లేదా కాల్చిన పెసర పప్పు అప్పడం తినడం వల్ల ఆకలి పెరుగుతుంది. తినాలనే కోరిక పెరుగుతుంది. ఇందులో పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.