నెల రోజులు అన్నం తినకపోతే ఏమవుతుందో తెలుసా? 

23 October 2024

TV9 Telugu

TV9 Telugu

సకల ప్రాణులకూ మూలాధారం అన్నం. అన్నమంటే ఆహారం. దాని నుంచే సకల ప్రాణులూ ఉద్భవించాయని కృష్ణపరమాత్ముడి సందేశం

TV9 Telugu

శరీరంలోని ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన రూపాల్లో ఉండే పంచప్రాణాలకు పంచభూతాల్లోని శక్తిని అందించడానికి పరమాత్మ తత్వమైన ఆహారాన్ని తీసుకోవాలి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు

TV9 Telugu

అన్నం మన ఆహారంలో ముఖ్యమైన భాగం. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టదు కాబట్టి దీన్ని లైట్ ఫుడ్ అని కూడా అంటారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు, స్టార్చ్ వంటి అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి

TV9 Telugu

అందువల్ల అన్నం ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఎల్లప్పుడూ మితంగా తింటేనే ఆరోగ్యం. అదే నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని పోషకాహార నిపుణులు అంటున్నారు

TV9 Telugu

బియ్యం పిండి పదార్ధం, ఇందులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తక్కువ అన్నం తింటే బరువు అదుపులో ఉంటుంది

TV9 Telugu

అలాగే రక్తంలో చక్కెరను నియంత్రించాలనుకుంటే, అన్నం మితంగా తినాలి. అలాగని పూర్తిగా మానేకూడదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు

TV9 Telugu

అన్నం తేలికైన ఆహారం. ఇది త్వరగా జీర్ణమవుతుంది. ఇటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వారు అన్నం బదులు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని తినవచ్చు. ఫలితాంగా ఆరోగ్యంగా ఉండవచ్చు

TV9 Telugu

బియ్యంలో నియాసిన్, థయామిన్ వంటి పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని తినకపోవడం ఈ మూలకాల లోపానికి దారితీస్తుంది. కానీ గుర్తుంచుకోండి.. మితంగానే ఎల్లప్పుడూ తినాలి