సీజనల్ వ్యాధులు రావొద్దంటే ఈ గింజలు రోజుకో స్పూన్‌ తింటే సరి!

23 October 2024

TV9 Telugu

TV9 Telugu

వాతావరణం క్రమంగా మారిపోయింది. రాత్రి అవుతున్న కొద్దీ చలచల్లగా గాలి తగులుతుంది. శ్వాస సమస్యలు ఉన్నవారికి ఇది అంత మంచి సీజన్‌ కాదు

TV9 Telugu

కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సీజన్ మారుతున్న సమయంలో ఆరోగ్యంగా జీవించడానికి తెల్ల నువ్వులు బలేగా ఉపయోగపడతాయి

TV9 Telugu

తెల్ల నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. వీటిల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలు శరీరంలో మెటబాలిక్ రేటును పెంచడంలో సహాయపడతాయి

TV9 Telugu

ఫలితంగా మధుమేహం వంటి వ్యాధులను నివారిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏదైనా ఇన్ఫెక్షన్ గురించి మరింత అవగాహన కలిగి ఉండాలి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి శీతాకాలంలో తెల్ల నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవాలి

TV9 Telugu

చలికాలంలో చర్మం పొడిబారుతుంది. చర్మం పొడిగా మారినప్పుడు, చర్మం స్థితిస్థాపకత కూడా తగ్గుతుంది. అయితే చర్మ కాంతిని పెంచడంలో నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి

TV9 Telugu

అందుకే చలికాలంలో చర్మ సంరక్షణ కోసం తెల్ల నువ్వులను తినవచ్చు. ఇది లోపలి నుండి చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. తెల్ల నువ్వులలో కాల్షియం, ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో తెల్ల నువ్వులు అద్భుతంగా సహాయపడతాయి

TV9 Telugu

శీతాకాలంలో లేదా సీజన్ మారుతున్న సమయంలో నువ్వులు తినడం వల్ల వైరస్‌లతో పోరాడే శక్తి పెరుగుతుంది. చలి కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీంతో చాలా మంది జ్వరం-జలుబు-దగ్గు బారిన పడుతుంటారు

TV9 Telugu

నువ్వులు తీసుకోవడం వల్ల మొత్తం రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గులను త్వరగా అధిగమించవచ్చు. కానీ గుర్తుంచుకోండీ.. ఎవరికైనా నువ్వుల వల్ల అలర్జీ ఉంటే వీటిని తినకపోవడమే మంచిది