Raft fall: తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

Raft fall: తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

Anil kumar poka

|

Updated on: Oct 23, 2024 | 9:24 PM

వెదురు కర్రలతో తాత్కాలికంగా తయారు చేసిన ఆ తెప్పను తాడు సహాయంతో అవతలి ఒడ్డువైపు లాగేలా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ తెప్పపై ఎక్కువ మంది ఉండటంతో అధిక బరువు వల్ల అది బ్యాలెన్స్‌ తప్పింది. దీంతో ఒక పక్కకు ఆ తెప్ప ఒరిగింది. ఈ నేపథ్యంలో దానిపై ఉన్నవారిలో చాలా మంది ఆ నడిలో పడిపోయారు.

బీహార్‌లోని పూర్నియా జిల్లాలో ప్రమాదకర ఘటన జరిగింది. కొందరు తృటిలో ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు. మరణించిన ఒక వ్యక్తి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కొందరు నదిని దాటే ప్రయత్నం చేశారు. వంతెన లేకపోవడంతో వెదురు కర్రలతో తాత్కాలికంగా ఒక తెప్పను తయారు చేశారు. పిల్లలు, పెద్దలతో సహా సుమారు 20 మంది ఆ తెప్పపై నదిని దాటేందుకు ప్రయత్నించారు. వెదురు కర్రలతో తాత్కాలికంగా తయారు చేసిన ఆ తెప్పను తాడు సహాయంతో అవతలి ఒడ్డువైపు లాగేలా ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ తెప్పపై ఎక్కువ మంది ఉండటంతో అధిక బరువు వల్ల అది బ్యాలెన్స్‌ తప్పింది. దీంతో ఒక పక్కకు ఆ తెప్ప ఒరిగింది. ఈ నేపథ్యంలో దానిపై ఉన్నవారిలో చాలా మంది ఆ నడిలో పడిపోయారు. మరోవైపు నదిలో పడిన వారంతా ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కాగా, తెప్పపై ఉన్న వారు నదిలో పడిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.