Rotten Chicken: కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి.. వీడియో

Rotten Chicken: కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి.. వీడియో

Anil kumar poka

|

Updated on: Oct 23, 2024 | 9:09 PM

ఇది కలికాలం కాదు.. కల్తీకాలం అన్నట్టుగా మారింది. ఎక్కడ చూసినా నకిలీ వస్తువులు, కల్తీ సరుకులే.. ఏది ముట్టుకోవాలన్నా భయం.. ఏది తినాలన్నాఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా కల్తీ సరుకులకు అడ్డాగా మారింది హైదరాబాద్. అందుకే బయట ఏం తింటున్నా, తాగుతున్నా ఒకటికి.. రెండుసార్లు చెక్ చేసుకుంటే మంచిది. ఎవరైనా కల్తీ వస్తువులు తయారుచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్టు గుర్తిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి.

హోటళ్లలో మీరు లొట్టలు వేసుకుంటూ తినే చికెన్ బిర్యానీ ఫ్రెష్షేనా? మీరు కర్రీ పాయింట్లలో కొన్న చికెన్‌ తాజాదేనా? జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో ఒక్క చికెన్ షాపులోనే 700 కిలోల కుళ్లిన చికెన్‌ దొరకడం ఇలాంటి అనుమానాలను రేకెత్తిస్తోంది మరి. హైదరాబాద్‌ బేగంపేటలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడ దృశ్యాలను చూసి విస్తుపోయారు. ఓ చికెన్‌ సెంటర్‌లో పెద్ద మొత్తంలో కుళ్లిపోయిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. 700 కిలోల కుళ్లిన చికెన్‌ ను సీజ్ చేశారు. కుళ్లిన చికెన్‌కు కెమికల్స్‌ కలిపి అమ్మకాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. ఈ చికెన్‌ను హోటళ్లు, జనతా బార్లు, కర్రీ పాయింట్లకు విక్రయిస్తున్నారట. చికెన్‌ సెంటర్ సీజ్ చేసిన అధికారులు, యాజమాన్యంపై కేసులు నమోదు చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.