ఈ పండు దివ్యౌషధం.. ఖాళీ కడుపుతో తిన్నారంటే డాక్టర్‌తో పన్లేదిక
23 October 2024
Ravi Kiran
ఈ పండు నిమ్మకాయ రంగులో ఉంటుంది. బుద్ధ హస్తం ఆకారంలో పోలి ఉంటుంది. దీనిని బుషుకాన్ అని కూడా అంటారు.
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీంతో రుచికరమైన వంటకాలు చేయడమే కాదు.. దీన్ని చైనా, జపాన్లలో పెర్ఫ్యూమ్ చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ పండు అనేక రూపాల్లో నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. నొప్పిని తగ్గించే ఏజెంట్లు ఈ పండులో ఎక్కువగా కనిపిస్తాయి. అన్ని రకాల వాపులను తగ్గిస్తుంది.
ఇది చర్మంపై కోత, గాయం లేదా శస్త్రచికిత్స అయినా, ఇది అన్ని రకాల నొప్పికి ఉపయోగిస్తారు. ఈ పండు శ్వాసకోశ సమస్యలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ పండు ప్రేగులలో మంట నుండి ఉపశమనం కలిగిస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం, అతిసారం, తిమ్మిరి, కడుపు నొప్పి నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.
ఈ పండు రక్తనాళాల్లో పేరుకుపోయిన మురికిని కూడా తొలగిస్తుంది. రక్త ప్రసరణను పెంచడం ద్వారా స్ట్రోక్స్, గుండెపోటులను నివారిస్తుంది. కడుపునొప్పి, విరేచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే నొప్పి, అధిక రక్తస్రావం, చిరాకును తగ్గించడంలో ఈ పండు ఒక వరం వంటిది అంటున్నారు నిపుణులు.
ఈ పండు తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఈ పండుతొక్కలను ఔషధంగా ఉపయోగిస్తారు. ఎన్నో రకాల ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి.