ఎముకలను బలంగా మార్చచడంలో జున్ను ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం, కాల్షియం, విటమిన్ డి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా జున్ను బాగా సహాయపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ మనస్సును ప్రశాంతంగా మార్చుతుంది. ఆందోళన తగ్గుతుంది.
ఇక జున్నులో ఎసిటేట్, ప్రొపియనేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.
జున్నులో మెగ్నీషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపు చేయడంలో ఉపయోగపడుతుంది.
మలబద్ధకం, కడుపుబ్బరం వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా జున్ను బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
గర్భిణీలకు కూడా జున్ను ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా కడుపులో ఉండే ఆరోగ్యానికి జున్ను ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా జున్ను బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్లు మెదడు పనితీరును మెరుగు పరిచి జ్ఞాపకశక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విసయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.