Somy Ali: గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్ గా సోమీ అలీ పోస్ట్‌..

Somy Ali: గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్ గా సోమీ అలీ పోస్ట్‌..

Anil kumar poka

|

Updated on: Oct 23, 2024 | 8:21 PM

సల్మాన్‌ ఖాన్‌ పై బెదిరింపులకు పాల్పడే లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ పేరు తరచూ వార్తల్లో వినిపిస్తూ ఉంటుంది. ఎన్‌సీపీ నేత బాబా సిద్దిఖీ హత్యతో ఆ పేరు మరోసారి మారుమోగింది. ఆ గ్యాంగ్‌స్టర్‌ పేరును ప్రస్తావిస్తూ సల్మాన్‌ మాజీ ప్రేయసి సోమీ అలీ ఇన్‌స్టాగ్రాం వేదికగా ఒక మెసేజ్‌ పెట్టింది. ఇప్పుడు ఈ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది.

‘‘నమస్తే లారెన్స్ బిష్ణోయ్. జైలు నుంచి కూడా మీరు జూమ్‌ కాల్స్ చేస్తారని నాకు తెలిసింది. నేను మీతో కొన్ని విషయాలు చర్చించేందుకు మీతో మాట్లాడాలని అనుకుంటున్నా. మిమ్మల్ని ఎలా సంప్రదించాలి. ఈ ప్రపంచంలో రాజస్థాన్‌ నాకు ఇష్టమైన ప్రదేశం. తొలుత మీతో జూమ్‌ కాల్‌లో మాట్లాడిన తర్వాత అక్కడికి వెళ్లాలని అనుకుంటున్నాను. నన్ను నమ్మండి.. ఇదంతా మీ మంచికోసమే. మీ మొబైల్‌ నంబర్ ఇస్తే.. సంతోషిస్తా’’ అంటూ ఆమె తన పోస్టులో రాసుకొచ్చింది. అలాగే బిష్ణోయ్ ఫొటో షేర్ చేసింది. ఇప్పుడు ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆ గ్యాంగ్‌స్టర్ గుజరాత్ జైల్లో ఉన్నాడు.

గతంలో సల్మాన్‌ పై సోమీ అలీ తీవ్ర ఆరోపణలు చేసింది. సల్మాన్‌ నటించిన సూపర్‌హిట్‌ చిత్రం ‘మైనే ప్యార్‌ కియా’ పోస్టర్‌ షేర్‌ చేసిన ఆమె.. సల్మాన్‌ అమ్మాయిల్ని కొట్టేవాడనీ కేవలం తనను మాత్రమే కాదు ఎంతోమంది మహిళల్ని కొట్టాడనీ, దయచేసి ఇకనైనా ఆయన్ని అభిమానించడం ఆపండనీ అతనొక శాడిస్ట్‌ మానసిక రోగి అనీ ఈ విషయం ఎవరికీ తెలియదనీ రాసుకొచ్చింది. అయితే ఆ పోస్టు వైరల్ కావడంతో తర్వాత దానిని డిలీట్ చేసింది. సోమీ అలీ పాకిస్థానీ అమెరికన్‌ నటి. పలు బాలీవుడ్‌ చిత్రాల్లో నటించింది. సల్మాన్‌ ఖాన్‌ – సోమీ అలీ ప్రధాన పాత్రల్లో గతంలో ఓ చిత్రాన్ని ప్రకటించారు. చిత్రీకరణ దశలో ఉండగానే ఈ సినిమా ఆగిపోయింది. అయితే, ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే సోమీ – సల్మాన్‌ ప్రేమలో పడినట్లు అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదే విషయంపై ఓ సందర్భంలో సోమీ స్పందిస్తూ.. సల్మాన్‌ అంటే తనకెంతో ఇష్టమనీ సల్మాన్‌కు తన ప్రేమను తెలియజేశానని చెప్పింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు వీళ్లిద్దరూ విడిపోయారు.

సల్మాన్‌ ఖాన్‌ 1998లో కృష్ణ జింకలను వేటాడారు. దానికి సంబంధించి ఆయనపై కేసు నడుస్తోంది. కృష్ణజింకలను బిష్ణోయ్‌ వర్గం వారు పవిత్రంగా పరిగణిస్తారు. వీటిని వేటాడటం అదే వర్గానికి చెందిన లారెన్స్‌కు ఎంతమాత్రం నచ్చలేదు. 2018 నుంచి సల్మాన్‌ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ గ్యాంగ్‌ పనిచేస్తోంది. 2024 ఏప్రిల్‌లో సల్మాన్‌ ఇంటిపై కాల్పులు జరిపింది. అంతకు మందు అతడి ఫామ్‌ హౌస్‌ వద్ద రెక్కీ నిర్వహించింది. సల్మాన్‌పై దాడికి దాదాపు పాతిక మందిని సిద్ధం చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తాజాగా సల్మాన్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిది లారెన్స్ గ్యాంగ్ అని పోలీసులు తెలిపారు. తాజాగా సిద్దిఖీ హత్యతో ముంబయి నగరం ఉలిక్కిపడింది. ఆ హత్య తామే చేశామని ఈ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించుకుంది. సిద్దిఖీకి సల్మాన్‌ కు సత్సంబంధాలున్నాయి. ఈ హత్య అనంతరం నటుడితో సంబంధాలు నెరిపేవారందరికీ ఈ గ్యాంగ్ హెచ్చరికలు కూడా చేసింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.