Kitchen Tips: మీ ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉందా.? ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చూసుకోండి, చాలా డేంజర్..

ప్రస్తుతం ఫ్రిడ్జ్‌ లేని ఇళ్లు లేదని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్‌ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. ఆహార పదార్థాలు పాడవకుండా ఉండడానికి ఫ్రిడ్జ్‌ను ఉపయోగిస్తుంటారు. ఫ్రిడ్జ్‌లో ఉండే చల్లటి వాతావరణం పదార్థాలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండే చూసుకుటుంది. ముఖ్యంగా వేసవిలో ఆహారం బయట ఉంటే త్వరగా పాడవుతుంది...

Kitchen Tips: మీ ఇంట్లో ఫ్రిడ్జ్‌ ఉందా.? ఈ పొరపాట్లు చేస్తున్నారేమో చూసుకోండి, చాలా డేంజర్..
Follow us

|

Updated on: Dec 31, 2022 | 9:38 AM

ప్రస్తుతం ఫ్రిడ్జ్‌ లేని ఇళ్లు లేదని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్‌ తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. ఆహార పదార్థాలు పాడవకుండా ఉండడానికి ఫ్రిడ్జ్‌ను ఉపయోగిస్తుంటారు. ఫ్రిడ్జ్‌లో ఉండే చల్లటి వాతావరణం పదార్థాలు ఎక్కువ కాలం పాడవకుండా ఉండే చూసుకుటుంది. ముఖ్యంగా వేసవిలో ఆహారం బయట ఉంటే త్వరగా పాడవుతుంది. ఇలాంటి సమయాల్లో ఫ్రిడ్జ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఫ్రిడ్జ్‌ ఉపయోగించే విధానంలో మనం తెలిసి, తెలియక చేసే కొన్ని తప్పులు అనర్థాలకు దారి తీస్తుందని మీకు తెలుసా.? ఫ్రిడ్జ్‌లో ఎలాంటి ఆహార పదార్థాలను స్టోర్‌ చేసుకోవాలి.? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

* వండిన వస్తువులను, పచ్చి కూరగాయలను ఒకే రాక్‌లో స్టోర్‌ చేయకూడదు. దీనివల్ల అవిచెడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వేరు వేరు రాక్స్‌లో అది కూడా గాలి చొరబడని మూతను ఉంచాలి.

* ఇక కాల్చిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్‌లో ఉంచితే ఎట్టి పరిస్థితుల్లో స్టీల్‌ బాక్స్‌లలోనే స్టోర్ చేయాలి. ప్లాస్టిక్‌ వాటిలో పెడితే ఆరోగ్యానికి హానికరం.

ఇవి కూడా చదవండి

* ఫ్రిడ్జ్‌లో ఉండే డీప్‌ కింద ఎలాంటి ఆహార పదార్థాలు ఉంచకూడదు. ఫ్రీజర్‌ కింద అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. కాబట్టి ఆహారం పడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రీజర్‌కు ఒక ర్యాక్‌ను వదిలి ఫుడ్‌ను స్టోర్ చేసుకోవాలి.

* కొందరు చపాతీల కోసం తయారు చేసిన పిండిని కూడా ఫ్రిడ్జ్‌లో పెడతారు. అయితే దీనివల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఫ్రిడ్జ్‌లో ఉంచిన పిండితో చేసే రోటీలు అంత త్వరగా జీర్ణం కావు.

* పాలను కూడా ఎక్కువ సేపు ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు. పాలలో బ్యాక్టీరియా ఫామ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ స్టోర్ చేయాల్సిన వస్తే గాలి వెళ్లకుండా మూత బిగించాలి.

* వెన్నను ఫ్రిడ్జ్‌లో 15 రోజులకు మించి ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల వెన్న క్వాలిటీతో పాటు రుచి కూడా తగ్గుతుంది. అందులోనూ వెన్నను ఫ్రిడ్జ్‌లో పెట్టే ముందు బాగా ప్యాక్‌ చేయాలి.

* పొరపాటున కూడా బ్రెడ్‌ను ఫ్రిడ్జ్‌లో స్టోర్‌ చేయకూడదు. ఇలా చేయడం వల్ల బ్రెడ్‌పై ఫంగస్‌ ఫామ్‌ అయ్యే అవకాశాలు ఉంటాయి.

* బంగాళాదుంపలను ఫ్రిడ్జ్‌లో ఎట్టిపరిస్థితుల్లో స్టోర్‌ చేయకూడదు. ఇలా చేస్తే దానిలోని పిండి పదార్థం విచ్నిన్నమై, తియ్యగా మారే అవకాశాలు ఉంటాయి.

* వండి అన్నాన్ని రెండు రోజులకు మంచి ఫ్రిడ్జ్‌లో ఉంచకూడదు. ఫ్రిడ్జ్‌ నుంచి తీసిన తర్వాత, సాధారణ ఉష్ణోగ్రతలో కొద్దిసేపు ఉంచి, ఆ తర్వాతే ఆహారాన్ని తీసుకోవాలి.

* కట్ చేసిన పండ్లను ఫ్రిడ్జ్‌లో ఎట్టి పరిస్థితుల్లో ఉంచకూడదు. దీనివల్ల ఆరోగ్యానికి హౄని చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..