AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎక్కువగా చెమటలు పడితే కేలరీలు వేగంగా బర్న్ అవుతున్నట్లా..? దీని వెనుక పెద్ద కథ ఉంది..

చాలా మంది వర్కౌట్ సమయంలో ఎక్కువ చెమటలు పడితే, ఎక్కువ కేలరీలు బర్న్ అవుతున్నాయని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటారు.. అయితే, ఇది నిజమేనా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..

ఎక్కువగా చెమటలు పడితే కేలరీలు వేగంగా బర్న్ అవుతున్నట్లా..? దీని వెనుక పెద్ద కథ ఉంది..
Workout Sweating
Shaik Madar Saheb
|

Updated on: Dec 16, 2024 | 2:46 PM

Share

ప్రస్తుత కాలంలో చాలామంది ఊబకాయం, పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అనుసరించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, ఫిట్ ఉండటం చాలా ముఖ్యం.. అయితే.. ఫిట్‌గా ఉండాలంటే వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఊబకాయంతో బాధపడేవారు బరువు తగ్గడానికి జిమ్‌లో ఎక్కువగా చెమటలు పట్టిస్తారు. కానీ, ప్రతి వ్యక్తి యొక్క వ్యాయామ దినచర్య భిన్నంగా ఉంటుంది. కొంతమంది కార్డియో చేస్తుంటే.. మరి కొంతమంది శక్తి శిక్షణపై దృష్టి పెడతారు. వ్యాయామం చేస్తున్నప్పుడు, ప్రజలు దానికి సంబంధించిన కొన్ని అపోహలను నమ్మడం ప్రారంభిస్తారు.

చాలా మంది వర్కౌట్ సమయంలో ఎక్కువ చెమటలు పడితే, ఎక్కువ కేలరీలు బర్న్ అవుతున్నాయని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని అనుకుంటారు. అయితే, ఇందులో నిజమెంత..? ఇది నిజమేనా.. ? దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం.. అవసరం కూడా..

అధిక చెమట వల్ల కేలరీలు వేగంగా కరిగిపోతాయని ప్రజలు నమ్ముతారు. ఇలాంటి ప్రశ్న చాలా సార్లు ప్రజల మదిలో మెదులుతుంది. శరీరం నుంచి చెమటలు పట్టడం అనేది సహజమైన ప్రక్రియ.. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది. పని చేస్తున్నప్పుడు, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. శరీరం చల్లబడటానికి చెమటలు పడతాయి.. ఎక్కువ చెమట పట్టడం వల్ల కేలరీలు వేగంగా కరిగిపోతాయో.. లేదో.. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం?..

చెమట పట్టడం వల్ల కేలరీలు బర్న్ అవుతాయా..?

మీరు ఎంత ఎక్కువ చెమట పడితే అంత వేగంగా బరువు తగ్గుతారు లేదా కేలరీలు బర్న్ అవుతారని తరచుగా ప్రజలు అనుకుంటారు. అయితే, ఇది నిజం కాదు. మీ శరీరం ఎక్కువగా చెమటలు పట్టినప్పుడు, మీరు ఎక్కువ కేలరీలు కరిగిపోయారని దీని అర్థం కాదు. అధిక చెమట – కేలరీలు బర్నింగ్ మధ్య ఎటువంటి సంబంధం లేదు.

కేలరీలు ఎలా బర్న్ అవుతాయి..

మీరు నడుస్తున్నట్లయితే, బరువులు ఎత్తడం లేదా ఏదైనా హై-ఇంటెన్సిటీ కార్డియో (HIIT) చేస్తున్నట్లయితే, మీ కేలరీలను బర్న్ చేసే సామర్థ్యం పెరుగుతుంది. కేలరీలు ఎంత త్వరగా కరిగిపోతాయి.. అనేది మీ శరీరంలోని శక్తి స్థాయి, కండరాలు ఎంత చురుకుగా ఉంటాయి.. వ్యాయామం చేసే సమయం మీద ఆధారపడి ఉంటుంది.

శరీరం నిర్జలీకరణం (డీహైడ్రేషన్) చెందనివ్వవద్దు..

వీలైనంత వరకు తగినంత నీరు తాగడం ప్రారంభించండి. అధిక చెమట కారణంగా మీరు డీహైడ్రేట్ అయినట్లయితే, అది మీ వ్యాయామ పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో నీరు లేకపోవడం వల్ల అలసట, బలహీనత, తల తిరగడం, కండరాల తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి చెమట ఎక్కువ కేలరీలు బర్న్ చేయదని గుర్తుంచుకోండి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి