Blood Clots: ఈ ఫుడ్స్ తీసుకున్నారంటే.. బ్లడ్ క్లాట్స్ కరిగిపోతాయి..
బ్లడ్ క్లాట్స్ గురించి ఈ మధ్య కాలంలో చాలా మంది వింటూ ఉంటున్నారు. బ్లడ్ క్లాట్స్ అవడం వల్ల ప్రాణానికే ప్రమాదంగా చెప్పొచ్చు. ఈ బ్లడ్ క్లాట్స్ అనేవి గుండె, మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి..
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. రక్త సరఫరా అనేది సవ్యంగా జరగాలి. రక్త సరఫరా సరిగ్గా జరుగుతేనే ఆరోగ్యంగా ఉంటాం. శరీరంలో ఉండే భాగలు కూడా ఆరోగ్యంగా పని చేస్తాయి. రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే ఒక్కోసారి బ్లడ్ క్లాట్స్ ఏర్పడతాయి. రక్తంలో గడ్డలు ఏర్పడితే.. ఇవి అడ్డంకులు సృష్టించి.. హార్ట్ ఎటాక్‌ని తెచ్చి పెడతాయి. బ్లడ్ క్లాట్స్ కట్టడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి. ఇవి సాధారణంగా కరగవు. అలానే శరీరంలో ఉండిపోతే ఆపరేషన్ చేసి తీయాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పే ఆహారాలు తింటే బ్లడ్ క్లాట్స్ అనేవి కరిగిపోతాయి. అంతే కాకుండా రక్తం గడ్డ కట్టకుండా కూడా చూస్తుంది. మరి ఆహారాలు ఏంటి? ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ డి:
విటమిన్ డి అనేది శరీరానికి చాలా ముఖ్యం. ఈ విటమిన్ ఉన్న ఆహారాలను తరచూ తీసుకుంటే రక్తం అనేది గడ్డకట్టకుండా ఉంటుంది. విటమిన్ డి అనేది మనకు నేచురల్‌గా సూర్య రశ్మి ద్వారా అందుతుంది. అలాగే మష్రూమ్స్, పాలు, చీజ్, కోడిగుడ్లు, చేపలు వంటి ఆహారాల కూడా లభ్యమవుతుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టకుండా ఉంటుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిని గుడ్ ఫ్యాట్స్‌గా చెబుతారు. ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి.. మంచి కొలెస్ట్రాల్ లెవల్స్‌ని పెంచుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు గింజల్లో ఎక్కువగా లభిస్తుంది. అవిసె గింజలు, చియా సీడ్స్, అవకాడో, వాల్ నట్స్, చేపలు వంటి వాటిల్లో మెండుగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల రక్త సరఫరా సక్రమంగా జరుగుతుంది. బ్లడ్ క్లాట్స్ అనేవి ఏర్పడకుండా ఉంటాయి.
వెల్లుల్లి:
వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. తరచూ తీసుకోవడం వల్ల సీజనల్ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా చేస్తుంది. కాబట్టి వెల్లుల్లి తీసుకోవడం మంచిది. అదే విధంగా ఉల్లిపాయలు, అల్లం, అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల రక్తం గడ్డ కట్టదు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి.