Pregnancy Test With Sugar: చక్కెరతో ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకోవచ్చా.. ఇందులో నిజమెంత..?

Pregnancy Test With Sugar: ప్రెగ్నెన్సీ కిట్‌ లేకుండా ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే అనేక చిట్కాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Pregnancy Test With Sugar: చక్కెరతో ప్రెగ్నెన్సీ టెస్ట్‌ చేసుకోవచ్చా.. ఇందులో నిజమెంత..?
Pregnancy Test
Follow us

|

Updated on: Feb 25, 2022 | 1:43 PM

Pregnancy Test With Sugar: ప్రెగ్నెన్సీ కిట్‌ లేకుండా ఇంట్లోనే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకునే అనేక చిట్కాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయతే తాజాగా చక్కెరతో ప్రెగ్నెన్సీ టెస్ట్ అనే వార్త నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. దీనిని చూసి ఇప్పటికే చాలామంది ప్రయత్నించి ఉండొచ్చు కానీ ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కచ్చితమైన ఫలితాలను ఇస్తుందా.. ఇందులో నిజం ఎంతుంది.. దీని గురించి నిపుణులు ఏమంటున్నారు తదితర విషయాల గురించి తెలుసుకుందాం. చక్కెరతో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ముందుగా ఒక శుభ్రమైన గిన్నెలో కొద్దిగా చక్కెరను తీసుకోవాలి. అందులో ఉదయం మొదటి సారిగా వెళ్లే యూరిన్‌ చుక్కలు వేయాలి. కొద్దిసేపు వేచి ఉన్న తర్వాత చక్కెరలో ఏదైనా మార్పు జరిగిందా గమనించండి. మూత్రంలో hCG ఉంటే సాధారణంగా చక్కెర కరిగిపోదు. అది ప్రెగ్నెన్సీ సంకేతంగా చెబుతున్నారు.

వైద్య నిపుణులు మాత్రం దీనిని నమ్మడం లేదు. ఎందుకంటే మహిళ యూరిన్‌లో చక్కెర కరగకపోవడానికి చాలా కారణాలు ఉంటాయని చెబుతున్నారు. ఈ పరిస్థితులలో ఇలాంటి చిట్కాపై ఆధారపడటం తప్పని చెబుతున్నారు. మరోవైపు ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు కూడా లేవంటున్నారు. మీరు ప్రెగ్నెన్సీ లక్షణాలను ఎదుర్కొంటుంటే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ప్రెగ్నెన్సీ కిట్‌తో చెక్ చేసుకోండని సూచిస్తున్నారు. గర్భం ధృవీకరించబడితే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. అంతేకాని ఇలాంటి పనులు చేయొద్దని హెచ్చరిస్తున్నారు.

ఒకసారి ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయతే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీ స్త్రీల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీని కారణంగా వారు అనేక రకాల శారీరక మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. మార్కెట్లో అనేక రకాల యాంటీ ఏజింగ్ క్రీమ్‌లు అమ్ముతారు. గర్భధారణ సమయంలో వీటిని ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇందులో రసాయనాలు కలుస్తాయి. ఇది దురద, మొటిమలు, మచ్చలు మొదలైన చర్మ సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. కొన్ని రసాయనాలు శిశువుకు కూడా హానికరం.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓ అప్‌డేట్‌.. రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఎఫెక్ట్‌ ఉంటుందా..!

Heart Attack: గుండెపోటు గురించి 3 సంవత్సరాల ముందుగానే తెలుసకోవచ్చు.. లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

త్వరగా బరువు తగ్గడానికి ఈ నూనె ఒక్కటి చాలు.. వ్యాయామం అవసరమే ఉండదు..!

ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!
ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!