Peanuts for Weight: పల్లీలు ఇలా తింటే బరువు పెరుగుతారా?
కొందరు వేరుశనగలు తినడం వల్ల బరువు పెరుగుతామని భయపడుతుంటారు. మరికొందరు ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయని చెబుతారు. రెండింటిలో ఏది నిజం? వేరుశనగలోని కేలరీలు, అవి బరువు పెరగడానికి సహాయపడతాయా లేదా బరువు తగ్గడానికి సహాయపడతాయా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది..

శీతాకాలంలో వేరుశనగలను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది చల్లని వాతావరణంలో చలి నుంచి రక్షణ కల్పించడంతోపాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కానీ కొందరు వేరుశనగలు తినడం వల్ల బరువు పెరుగుతామని భయపడుతుంటారు. మరికొందరు ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయని చెబుతారు. రెండింటిలో ఏది నిజం? వేరుశనగలోని కేలరీలు, అవి బరువు పెరగడానికి సహాయపడతాయా లేదా బరువు తగ్గడానికి సహాయపడతాయా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అసలు వీటిని ఎవరు తినకూడదు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
వేరుశెనగ తినడం వల్ల బరువు పెరుగుతారా లేదా తగ్గుతుందా?
ఢిల్లీలోని GTB హాస్పిటల్‌లో మాజీ డైటీషియన్‌గా పనిచేసిన డాక్టర్ అనామిక గౌర్ ఏం చెబుతున్నారంటే.. వేరుశెనగల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం తినడం వల్ల బరువు పెరగదని పరిశోధనలు చెబుతున్నాయి. వాస్తవానికి వేరుశెనగల్లోని కేలరీలలో దాదాపు 25 శాతం ప్రోటీన్ ఉంటుంది. మొక్కల ఆధారిత ప్రోటీన్ శరీరంలోకి ప్రవేశించినప్పుడు అది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అందువలన ఆకలి తగ్గుతుంది. అతిగా తినడం తగ్గుతుంది. ఇది బరువు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. అంతే కాదు వేరుశెనగల్లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలకు మంచిది. అయితే, నెయ్యి లేదా నూనెలో వేయించిన వేరుశెనగలు తినడం వల్ల బరువు పెరుగుతారు.
బెల్లం తో వేరుశెనగలు తింటే..
సాధారణంగా వేరుశనగలను బెల్లంతో కలిపి తినడం శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బెల్లంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. వేరుశనగలో ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి కలయిక ఆరోగ్యానికి మంచిది. కానీ కొంతమంది మాత్రం పల్లీలు లేదా వేరుశనగపప్పు తినడం అంత మంచిది కాదు. అలాగే, రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ తినకూడదు.
వేరుశెనగ ఎవరికి మంచిది కాదంటే..
- మలబద్ధకం సమస్యలు ఉన్నవారికి
- వేరుశెనగల అలెర్జీ ఉన్నవారికి
- తక్కువ బరువు ఉన్నవారికి
- అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులకు వీటిని తినడం మంచిది కాదు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




