Interesting Facts: చనిపోయిన వారి ముక్కులో దూది ఎందుకు పెడతారో తెలుసా!
మనిషి మరణించిన తర్వాత కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి. అందులో ఒక్కటి చెవిలో, ముక్కులో దూది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారని చాలా మందికి సందేహాలు వచ్చే ఉంటాయి. అవి పెద్దవారిని అడిగితే.. వారికి తోచింది చెప్పి ఉంటారు. ఇలా కేవలం హిందూ మతంలో మరణించిన వారికి మాత్రమే పెడతారు. ఇలా ముక్కులో దూది పెట్టడం వెనుక చాలా రకాల కథలు ఉన్నాయి. హిందూ మతంలో కేవలం మనిషి పుట్టినప్పుడే కాదు.. మరణించినప్పుడే కొన్ని రకాల సంప్రదాయాలను..

మనిషి మరణించిన తర్వాత కొన్ని రకాల ఆచారాలు ఉంటాయి. అందులో ఒక్కటి చెవిలో, ముక్కులో దూది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారని చాలా మందికి సందేహాలు వచ్చే ఉంటాయి. అవి పెద్దవారిని అడిగితే.. వారికి తోచింది చెప్పి ఉంటారు. ఇలా కేవలం హిందూ మతంలో మరణించిన వారికి మాత్రమే పెడతారు. ఇలా ముక్కులో దూది పెట్టడం వెనుక చాలా రకాల కథలు ఉన్నాయి.
హిందూ మతంలో కేవలం మనిషి పుట్టినప్పుడే కాదు.. మరణించినప్పుడే కొన్ని రకాల సంప్రదాయాలను పాటిస్తారు. అలాగే మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు కూడా కొంత మంది పూజలు కూడా చేస్తారు. ఈ క్రమంలోనే చెవిలోని, ముక్కులోని దూది పెడతారు. దీని వెనుక పలు శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణాలు కూడా ఉన్నాయి.
సైన్స్ ప్రకారం ఏంటంటే..
మనిషి మరణించిన తర్వాత.. ముక్కులో నుంచి, చెవిలో నుంచి ఒక ప్రత్యేకమైన ద్రవం బయటకు వస్తుంది. ఆ ద్రవాన్ని బయటకు రానివ్వకుండా ఆపడానికి దూది పెడతారు. అలాగే మరణాంతరం శరీరంలోకి ఎలాంటి బ్యాక్టీరియా వెళ్లకుండా ఉండటానికి దూదితో ఉంచుతారు. ఇలా పెట్టడం వల్ల గాలి కూడా లోపలికి వెళ్లదు. దీంతో మృత దేహం త్వరగా పాడవ్వకుండా ఉంటుంది.
ఆధ్యాత్మిక కారణాలు ఏంటో చూద్దాం..
మనిషి మరణించడం వెనుక చాలా రకాల శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. మరణించిన వ్యక్తి ఆత్మకు శాంతి కలగాలని ముక్కు దగ్గర చిన్న బంగారు ముక్కలు ఉంచేవారట. ఆ ముక్కలు కింద పడకుండా ఉండటానికి దూది పెట్టేవారని పెద్దలు చెబుతారు. అలాగే చనిపోయిన వ్యక్తికి ప్రాపంచిక విషయాలతో ఎలాంటి సంబంధం ఉండదని గరుడ పురాణం కూడా చెబుతోంది.
మరో కారణం కూడా ఉంది..
చనిపోయిన వ్యక్తి ముక్కుకి, చెవులకి దూది పెట్టడం వెనుక మరో కథ కూడా ఉంది. మనిషి మరణించిన తర్వాత యమధర్మ రాజు.. శరీరం నుంచి ఆత్మను వేరే చేస్తాడు. ఆ ఆత్మ మళ్లీ తిరిగి శరీరంలోకి ప్రవేశించేందుకు మార్గం కోసం వేచి చూస్తుందని.. అందుకే మళ్లీ ఆత్మ శరీరంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు చెవిలో, ముక్కులో దూది పెడతారని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలా ప్రాంతం బట్టి కూడా కొన్ని రకాల కారణాలు ఉంటాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.