జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి బెస్ట్ టిప్స్ ఇవే!

samatha 

30 march 2025

Credit: Instagram

జ్ఞాపకశక్తిని పెంచుకోవాలి అనుకునే వారు ప్రతీ రోజూ తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు అవి ఏవి అంటే?

రోజులో ఒక్కసారైన చదరంగం, సుడోకో, క్రాస్ వర్డ్, పజిల్స్ వంటివి ఆడటం వలన జ్ఞాపక శక్తిపెరగడమే కాకుండా మెదడు పనితీరు బాగుంటుందంట.

మీరు నేర్చుకున్నది ఇతరులకు నేర్పించడం ద్వారా కూడా మీకు ఆ అంశంపై మరింత పట్టురావడమే కాకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుందంట. దానిని ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు.

జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి మీకు అవసరమైన సమాచారన్ని డిఫరెంట్‌గా బొమ్మల ఆధారంగా, ప్రజంటేషన్స్, గ్రాఫ్‌ల ద్వారా నేర్చుకోవాలి. దీని వలన త్వరగా మర్చిపోము.

గ్రూప్ స్కిర్షన్స్, ఆడియోస్ వినడం, ప్రజంటేషన్లకు అటెండ్ అవ్వడం వలన కూడా జ్ఞాపకశక్తి పెరుగుతంది అంటున్నారు నిపుణులు. అందుకే ఎక్కువగా చదివినదానిని చర్చించుకోవాలి.

చదివిన దానిని కొందరు మళ్లీ చదవడానికి అస్సలే ఇష్టపడరు. కానీ మీరు చదివిన వాటిని మరోసారి చదవడం వలన ఆ సమాచారం మీకు సులభంగా గుర్తుంటుంది. జ్ఞాపక శక్తిపెరుగుతుంది.

మీ స్నేహితులతో చర్చిస్తూ.. రోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చకోవడం వలన కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది మీ మొదడులోని కొత్త న్యూరాన్ కనెక్షన్లు ఏర్పడటానికి సహాయపడుతుంది.

చంకింగ్ ప్రాక్టీస్ చేయడం, ఏదైనా సమాచారాన్ని సులభంగా గుర్తు పెట్టుకోవడానికి,  వాటిని చిన్న విభాగాలుగా విభజించుకోండి. దీని వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.