AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: షుగర్‌ పేషెంట్స్‌ మూత్రం దుర్వాసన ఎందుకు.? అసలు కారణం ఏంటంటే..

చాలా మంది షుగర్‌ పేషెంట్స్‌ ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇది కూడా ఒకటి. అయితే మధుమేహం ఉన్న వారిలో మూత్రం దుర్వాసన రావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్‌ వచ్చిన వారి శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని తెలిసిందే. శరీరంలోని ఇన్సులిన్‌ లోపం లేదా ఇన్సులిన్‌ సరిగా పనిచేయనప్పుడు రక్తంలో ఉన్నపలంగా గ్లూకోజ్‌ స్థాయి...

Diabetes: షుగర్‌ పేషెంట్స్‌ మూత్రం దుర్వాసన ఎందుకు.? అసలు కారణం ఏంటంటే..
Diabetes
Narender Vaitla
|

Updated on: Aug 08, 2024 | 4:47 PM

Share

ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో డయాబెటిస్‌ ప్రధానమైంది. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరీ ముఖ్యంగా భారత్‌లో షుగర్‌ పేషెంట్స్‌ సమస్య ఎక్కువుతోంది. మధుమేహం రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో జీవన విధానంలో మార్పులు మొదలు, జన్యుపరమైన అంశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మధుమేహం ఉన్న వారు ఎదుర్కొనే సమస్యలో దుర్వాసనతో కూడుకున్న మూత్రం కూడా ఒకటి.

చాలా మంది షుగర్‌ పేషెంట్స్‌ ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఇది కూడా ఒకటి. అయితే మధుమేహం ఉన్న వారిలో మూత్రం దుర్వాసన రావడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిస్‌ వచ్చిన వారి శరీరంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని తెలిసిందే. శరీరంలోని ఇన్సులిన్‌ లోపం లేదా ఇన్సులిన్‌ సరిగా పనిచేయనప్పుడు రక్తంలో ఉన్నపలంగా గ్లూకోజ్‌ స్థాయి పెరుగుతుంది. ఇది శరీరంలోని అదనపు చక్కెరను మూత్రం ద్వారా తొలగించడానికి ప్రయత్నిస్తుంది. డయాబెటిస్‌ రోగుల మూత్రం వాసన రావడానికి ఇదే ప్రధాన కారణమని చెప్పొచ్చు. అంతేకాకుండా డయాబెటిక్ రోగులలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది మూత్రం దుర్వాసనకు మరొక కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా కారణాలే..

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌ కారణంగా మూత్రంలో వాసనతో పాటు, మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపిండచం, తరచూ మూత్రవిసర్జన చేయాల్సి రావడం వంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఇక మూత్రం దుర్వాస రావడానికి మరో కారణం కీటోయాసిడోసిస్. శరీరంలో చాలా కీటోన్లు ఉత్పత్తి అయినప్పుడు ఈ సమస్య వస్తుంది. కొన్ని సందర్భాల్లో డీహైడ్రేషన్ కారణంగా కూడా మూత్రం రంగు ముదురు రంగులోకి మారడం, దుర్వాసన వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే లివర్‌ లేదా మూత్రపిండాల సమస్యలు మూత్రం దుర్వాసన రావడానికి కారణంగా చెప్పొచ్చు.

ఇలా చేయండి..

మూత్రం ఎలాంటి దుర్వాసన లేకుండా ఉండాలంటే కచ్చితంగా ప్రతీ రోజూ సరిపడ నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే చక్కెర, కార్బోహైడ్రేట్ల మొత్తాన్ని నియంత్రించాలి. పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే క్రమంతప్పకుండా చెక్‌ చేసుకోవాలి. ఇన్ఫెక్షన్లకు సంబంధించిన ఏమాత్రం లక్షణాలు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించి, వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
రూ.60,000 కంటే తక్కువ ధరకే ఐఫోన్ 16.. అదిరిపోయే డీల్‌!
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
నిజమైన సంతోషం ఎందులో ఉంది.. 85 ఏళ్ల పరిశోధనలో తేలిన అసలు రహస్యం..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
ఇప్పుడే కొనేయండి.. 2026లో బంగారం ధర ఎంత పెరుగుతుందో అస్సలు
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..