AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganja: గంజాయి సేవించే వారిని ఇట్టే కనిపెట్టవచ్చు.. ఎలాగంటే..

గంజాయి ప్రభావం శరీరంలో దాదాపు అన్ని భాగాలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజాయి నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్‌ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుంది. అయితే ఆ వ్యక్తి గంజాయిని ఎన్నిసార్లు తీసుకుంటాడనే దానిపై ఇది ఆధారపడి..

Ganja: గంజాయి సేవించే వారిని ఇట్టే కనిపెట్టవచ్చు.. ఎలాగంటే..
Ganjayi
Narender Vaitla
|

Updated on: Aug 08, 2024 | 4:04 PM

Share

ఇటీవల గంజాయి వినియోగం భారీగా పెరుగుతోంది. ప్రతీ రోజూ గంజాయి పట్టుబడ్డ వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున గంజాయికి అలవాటు పడుతున్నారు. ఆరోగ్యానికి హానికరమని తెలిసినా.? ఈ దురలవాటును మాత్రం మానుకోలేకపోతున్నారు. అయితే గంజాయి తీసుకోవడం వల్ల శరీరంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన సైకోఫార్మకాలజిస్ట్ లెన్ మెక్‌క్రెగర్ ఈ విషయమై మాట్లాడుతూ.. గంజాయి తాగిన తర్వాత దాని నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్ (టీహెచ్‌సీ) అనే రసాయనం శరీరంలో చాలా వారాల పాటు శరీరంలో అలాగే ఉంటుందని చెబుతున్నారు.

గంజాయి ప్రభావం శరీరంలో దాదాపు అన్ని భాగాలపై పడుతుందని నిపుణులు చెబుతున్నారు. గంజాయి నుంచి విడుదలయ్యే టెట్రాహైడ్రోకానాబినాల్‌ రసాయనం మనిషి జుట్టులో 90 రోజులు, మూత్రంలో 30 రోజులు, లాలాజలంలో 24 గంటలు, రక్తంలో 12 గంటల పాటు ఉంటుంది. అయితే ఆ వ్యక్తి గంజాయిని ఎన్నిసార్లు తీసుకుంటాడనే దానిపై ఇది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

గంజాయిలోని టీహెచ్‌సీ రసాయనం శరీరంలోని అనేక కణజాలాలకు, అవయవాలకు చేరుతుంది. వీటిలో మెదడు, గుండె, కాలేయం, కొవ్వు ముఖ్యమైనవి. శరీరంలో జీర్ణక్రియ తర్వాత 85 శాతం పదార్థాలు బయటకు వెళ్లిపోతా మిగతావి శరీరంలో పేరుకుపోతాయి. కాలక్రమేణా, శరీర కణజాలాలలో నిల్వ చేయబడిన THC తిరిగి రక్త ప్రసరణలోకి విడుదల వుతుంది. ఇది తిరిగి కాలేయం ద్వారా జీవక్రియ జరుగుతుంది. గంజాయిలో ఉండే టీహెచ్‌సీ మత్తును పెంచుతుంది. గంజాయిని పీల్చుకున్న వెంటనే టీహెచ్‌సీ రక్తంతోపాటు, మెదడుకు చేరుకుంటుంది. దీంతో మెదడులోని న్యూరాన్లు అదుపు తప్పుతాయి.

నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇంజినీరింగ్ అండ్ మెడిసిన్ నివేదిక ప్రకారం.. గంజాయిని సేవించడం వల్ల బైపోలార్ డిజార్డర్‌ సమస్య వస్తుంది. ఇది నిరాశ, మానసిక సమస్యలకు కారణమవుతుంది. గంజాయి సేవించే వారిలో క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా దీనివల్ల వృషణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గంజాయిని దీర్ఘకాలంగా సేవించే వారిలో ఊపిరితిత్తుల పనితీరును ప్రభావితం చేస్తుంది. అలాగే ఆస్తమా వంటి సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
శీతాకాలంలో ప్రెగ్నెంట్ మహిళలకు సైంటిస్టుల హెచ్చరిక..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
పొన్నగంటి పోషకాల పవర్‌హౌజ్‌.. తరచూ తింటే ఆ సమస్యలన్నీమాయం..!
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
సౌందర్య భర్త ఇప్పుడేం చేస్తున్నారంటే.. సీనియర్ హీరో..
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
ఒకటి కంటే ఎక్కువ PF అకౌంట్లు ఉన్నాయా? వాటిని విలీనం చేయడం ఎలా?
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్