AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.. ఈ సామెత అర్థం తెలుసా?

Telugu Samethalu: తెలుగు సామెతలు మన పూర్వీకుల అనుభవాలకు అద్దం పడతాయి. కొన్ని సామెతలు వినడానికి సరదాగా ఉన్నప్పటికీ, వాటి వెనుక ఎంతో లోతైన జీవిత సత్యం దాగి ఉంటుంది. అలాంటి ఆసక్తికరమైన సామెతల్లో “కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు” ఒకటి. అసలు ఈ సామెతను ఎప్పుడు ఉపయోగిస్తారు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన భావం ఏమిటి? తెలుసుకుందాం.

కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.. ఈ సామెత అర్థం తెలుసా?
Telugu Proverb Meaning
Janardhan Veluru
|

Updated on: Nov 07, 2026 | 1:21 PM

Share

Telugu Proverb Meaning: తెలుగు భాషలో సామెతలకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వాడుకలో ఉన్న ఈ సామెతల్లో లోతైన అర్థం ఉంటుంది. మన పూర్వీకులు తమ జీవిత అనుభవాలను, సమాజంలో జరిగే సంఘటనలను చిన్న చిన్న మాటల్లోనే సామెతల రూపంలో అద్భుతంగా వివరించారు. అలాంటి సామెతల్లో ఒకటి “కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు”. ఈ సామెతను మనం రోజువారీ జీవితంలోనూ తరచూ వింటుంటాం. ఇంతకీ దీని వెనుక ఉన్న అసలు భావం ఏమిటో తెలుసుకుందాం.

సామెత అర్థం ఏమిటి?

ఈ సామెతలోని అంతరార్థం ఏమిటంటే.. ఒక వ్యక్తి తన పనిని తాను సక్రమంగా చేసుకుంటూ ప్రశాంతంగా ఉంటే.. మరో వ్యక్తి వచ్చి అతడిని చెడగొట్టడం లేదా అతని పనికి ఆటంకం కలిగించడం. అంటే సజావుగా సాగుతున్న పనిలో అనవసరంగా జోక్యం చేసుకుని సమస్యలు సృష్టించే వ్యక్తులను ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు. గడ్డి మేయడం గాడిదకు కడుపు నింపే మంచి పని.. అయితే మరో అరిచే గాడిద వచ్చి దాని పనికి భంగం కలిగింది ఆహారం లేకుండా చేసిందని ఈ సామెత వివరిస్తుంది.

ఎప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు?

ఒక వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ, ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకుండా ఉంటాడు. ఇలాంటి సమయంలో మరో వ్యక్తి వచ్చి అనవసరమైన సలహాలు ఇవ్వడం, చెడు అలవాట్లు నేర్పించడం లేదా అతడిని తప్పుదారి పట్టించడం చేస్తే ఈ సామెతను ఉపయోగిస్తారు. అలాగే ఒక టీమ్‌లో అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటే, బయట నుంచి వచ్చిన వ్యక్తి తన మాటలతో లేదా ప్రవర్తనతో వారి మధ్య గొడవలు సృష్టించినప్పుడు కూడా ఈ సామెతను వర్తింపజేస్తారు.

ఇవి కూడా చదవండి

అలాగే ఒక విద్యార్థి సరిగ్గా చదువుతూ ఉంటే.. మరో విద్యార్థి అతని పనికి భంగం కలిగించిన సందర్భంలోనూ ఈ సామెతను వాడుతారు.

ఈ సామెతలోని నీతి ఏమిటి?

మన పనిని మనం సక్రమంగా చేసుకుంటూ, ఇతరుల అనవసర జోక్యానికి ప్రభావితం కాకుండా ఉండాలనేది ఈ సామెత ఇచ్చే సందేశం. అలాగే ఇతరులు ప్రశాంతంగా తమ పని చేసుకుంటున్నప్పుడు మనం అనవసరంగా జోక్యం చేసుకుని వారి పనులకు ఆటంకం కలిగించకూడదు.

Also Read: అడుసు తొక్కనేల కాలు కడగనేల..ఈ సామెత అర్థం తెలుసా?

Follow Us
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.. సామెత అర్థం తెలుసా
కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.. సామెత అర్థం తెలుసా
ఆ వీడియోస్ షేర్ చేయకండి.. సురేఖ వాణి ఫైర్..
ఆ వీడియోస్ షేర్ చేయకండి.. సురేఖ వాణి ఫైర్..
IND vs PAK: ఆసియా కప్‌లో రేపు హై వోల్టేజ్ మ్యాచ్!
IND vs PAK: ఆసియా కప్‌లో రేపు హై వోల్టేజ్ మ్యాచ్!
దీపావళి స్పెషల్ విషెస్.. మీ సన్నిహితుల మనసు గెలుచుకునే అద్భుతమైన
దీపావళి స్పెషల్ విషెస్.. మీ సన్నిహితుల మనసు గెలుచుకునే అద్భుతమైన
నేనెప్పుడు బాగుండాలని కోరుకునే నిజమైన స్నేహితుడు అతడే..
నేనెప్పుడు బాగుండాలని కోరుకునే నిజమైన స్నేహితుడు అతడే..
ధోనీని మాహి చాచు అని పిలుస్తా.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు!
ధోనీని మాహి చాచు అని పిలుస్తా.. నటి ఆసక్తికర వ్యాఖ్యలు!
పరిషత్ పోరులో కూటమి దూకుడు.. ఇప్పటి వరకు గెలిచిన స్థానాలు ఇవే!
పరిషత్ పోరులో కూటమి దూకుడు.. ఇప్పటి వరకు గెలిచిన స్థానాలు ఇవే!
బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.. బెల్లం పొంగడాలు తయారీ విధానం ఇదిగో!
బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.. బెల్లం పొంగడాలు తయారీ విధానం ఇదిగో!
ఐపీఎల్ 2027 వేలంలో ఆ ఇద్దరే టార్గెట్.. గంగూలీ సంచలన ప్రకటన..!
ఐపీఎల్ 2027 వేలంలో ఆ ఇద్దరే టార్గెట్.. గంగూలీ సంచలన ప్రకటన..!
ఇంటి ముందు కార్లు బారులు తీరేవి.. డేట్స్ కోసం ఎదురుచూసిన స్టార్ హ
ఇంటి ముందు కార్లు బారులు తీరేవి.. డేట్స్ కోసం ఎదురుచూసిన స్టార్ హ