ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

samatha

6 November 2026

Pic credit - Pinterest

ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో పెంచుకునే మొక్కల్లో మనీ ప్లాట్ ముందుంటుంది.  చాలా మంది ఫేవరెట్ మొక్క కూడా ఇదే.

మనీ ప్లాంట్

 అందుకే మనీ ప్లాంట్ మొక్కను తమ ఇంటి ప్రధాన ద్వారం, హాల్, కిచెన్, చివరకు బెడ్ రూమ్‌లో కూడా అలంకరణగా పెట్టుకుంటారు.

అలంకరణగా

అయితే మనీ ప్లాంట్ మొక్కను ఇంటిలో పెంచుకోవడం మంచిదే అయినప్పటికీ, ఆ మొక్క విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

తగు జాగ్రత్తలు తీసుకోవడం

మనీ ప్లాంట్ కి డైరెక్ట్ ఎండ తగలకూడదు, వెలుతురు వచ్చే చోట పెడితే సరిపోతుంది. ఈ మొక్కకు ఎక్కువగా ఎండ తగలడం వలన పాడయ్యే ఛాన్స్ ఉంది.

ఎండ

అలాగే ప్రతి రోజూ నీరు పోయాల్సిన పని లేదు, కేవలం వారానికి రెండు సార్లు మాత్రమే నీరు పోయాలి. అలాగే మూడు రోజులకు ఒకసారి నీటిని మార్చాలి.

నీరు విషయంలో జాగ్రత్తలు

చాలా మంది మట్టిలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే, బురదలా ఉండేలా చేస్తుంటారు. కానీ కాస్త తేమగా ఉంటే సరిపోతుంది.

తేమ తప్పనిసరి

అంతే కాకుండా ఎప్పటికప్పుడు  పసుపు రంగులోకి మారిన ఆకులను తెలిగించాలి. లేకపోతే మొక్క మొత్తం పాడైపోతుంది.

రంగు మారిన ఆకులను తుంచడం

 అలాగే,  వాస్తు ప్రకారం ఎప్పుడూ కూడా మనీ ప్లాంట్ మొక్కు ఈ శాన్యం లేదా ఉత్తరం దిక్కులో పెట్టండం చాలా వరకు మంచిది.

వాస్తు ముఖ్యం