మధుమేహం ఉన్నవారికి బొబ్బర్లు వరం లాంటివి.. తింటే బోలెడు లాభాలు!
07 November 2026
TV9 Telugu
TV9 Telugu
బొబ్బర్లనే అలసందలు అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బొబ్బర్లలో కొవ్వులు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి
TV9 Telugu
పీచు పదార్థం (ఫైబర్) కూడా ఎక్కువ. అందువల్ల ఇవి స్థూలకాయం లాంటి సమస్యలతోపాటు అనేక అనారోగ్య సమస్యలకు మంచి పరిష్కారం చూపుతాయి
TV9 Telugu
జీర్ణశక్తికి కూడా తోడ్పడుతాయి. శరీరంలో విషాలను తొలగిస్తాయి. మరి బొబ్బర్లతో ఇంకా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం
TV9 Telugu
బొబ్బర్లలో క్యాలరీలతోపాటు కొవ్వులు కూడా తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది
TV9 Telugu
మధుమేహులకు లో-గైసిమిక్ ఇండెక్స్ కలిగిన బొబ్బర్లు చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి
TV9 Telugu
బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉండటం వల్ల పోషకాహార లోపంతో వచ్చే కొన్నిరకాల వ్యాధులు ధరిచేరవు
TV9 Telugu
ఇవి శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర టాక్సిన్స్‌ను నివారిస్తాయి. బొబ్బర్లు రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి
TV9 Telugu
అంతేగాక హృదయ సంబంధ వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి. బొబ్బర్లలోని ఫ్లెవనాయిడ్స్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి మంచివి
మరిన్ని వెబ్ స్టోరీస్
చూస్తేనే నోరూరుతుంది కదూ.. తింటే లాభాలూ ఉన్నాయ్
కుండ Vs ఫ్రిజ్.. ఎండల్లో ఏ నీళ్లు ఆరోగ్యానికి మంచిది?
పెరుగు త్వరగా పులుస్తుందా? మీ వంటగదిలో ఈ చిన్న మార్పు చేయండి