పుల్లపుల్లగా ఉండే ఆంధ్ర స్పెషల్ గోంగూర చికెన్.. ఇలా చేస్తే

07 Nov 2026

Anand T

మీకు ఎప్పుడూ రెగ్యులర్ చికెన్ తిని బోర్ కొట్టిందా అయితే ఈ సారి ఆంధ్ర స్పెషల్ ఘుమఘుమలాడే గోంగూర చికెన్ ట్రై చేయండి.దీన్ని అదిరిపోయే రుచితో ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూద్దాం

గోంగూర చికెన్

చికెన్: 400 గ్రాములు , గోంగూర: 80 గ్రాములు ఉల్లిపాయ తరుగు: 1 కప్పు , పచ్చిమిర్చి: 2-3, అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్, కారం, ధనియాల పొడి: ఒక్కో చెంచా, జీలకర్ర, పసుపు, ఉప్పు, నూనె, కొత్తిమీర: తగినంత

కావాల్సిన పదార్థాలు

గోంగూర చికెన్ కోసం ముందుగా శుభ్రంగా కడిగిన గోంగూర ఆకులను పాన్‌లో వేసి, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి 4-5 నిమిషాలు మగ్గనివ్వండి.

గోంగూర ఉడికించడం

ఉడికించిన గోంగూర మిశ్రమాన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తని పేస్ట్‌లా రుబ్బుకుని పక్కన పెట్టుకోండి.

పేస్ట్‌గా రుబ్బుకోవడం

ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా, బంగారు రంగు వచ్చేవరకు వేయించండి.

ఉల్లిపాయలు వేపుడు

ఇప్పుడు వేగిన ఉల్లిపాయల్లో అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి.ఆపై పసుపు, ధనియాల పొడి, జీలకర్ర వేసి కొద్ది సెకన్ల పాటు కలపండి.

మసాలాలు జోడించడం

ఇప్పుడు చికెన్ ముక్కలు, కారం, తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. తర్వాత మూతపెట్టి మంటను తగ్గించి, చికెన్ మెత్తబడేవరకు 8 నుంచి 10 నిమిషాలు ఉడికించండి.

చికెన్ ఉడికించడం

గ్రేవీకి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పేస్ట్‌ను కలిపి, మరో 1-2 నిమిషాలు చిన్న మంటపై ఉడకనివ్వండి. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీరను వేస్తే చాలు.. గోంగూర చికెన్ కర్రీ రెడీ.. దీన్ని వేడివేడి అన్నం లేదా రోటీతో సర్వ్ చేసుకుంటే అదిరిపోతుందంతే.

సర్వింగ్