ఇదా అసలు మ్యాటర్.. ఆలూను ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టరో తెలుసా!

06 Nov 2026

Anand T

చాలా మంది మార్కెట్‌ నుంచి కూరగాయలు తీసుకురాగానే వాటిని శుభ్రం చేసి ఫ్రిజ్‌లో పెడతారు. కానీ కొన్ని అన్నింటి కాదు.. కొన్ని కూరగాయలను మాత్రమే ఫ్రిజ్‌లో ఉంచుతారు.

ఫ్రిజ్‌ స్టోరేజ్

మరికొన్నింటిని గది ఉష్ణోగ్రత వద్దే పెడతారు..అలాంటి వాటిలో ఆలూ కూడా ఒకటి. మరీ దీన్ని ఫ్రిజ్‌లో ఎందుకు పెట్టరో మీకు తెలుసా?

ఎందుకు పెట్టొద్దు

కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఆలూను ఫ్రిజ్‌లో పెట్టి తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని, అందుకే ఫ్రిజ్‌లో స్టోర్ చేయవద్దని చెబుతున్నాయి.  

అనారోగ్యం

ఆలూలో స్టార్చ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడు ఈ పిండి పదార్థం చక్కెరగా మారిపోతుంది.

చక్కెరగా మార్పు

ఫ్రిజ్ చల్లదనానికి బంగాళాదుంప పై తొక్క నల్లబడి, లోపల గోధుమ రంగులోకి మారుతుంది. దీనివల్ల అందులోని పోషక విలువలు పూర్తిగా నశిస్తాయి.

నల్ల బడడం

ఫ్రిజ్‌లో తీపిగా మారిన బంగాళాదుంపలను వేయించినా లేదా ఉడికించినా.. చక్కెరలు అమైనో ఆమ్లాలతో కలిసి ప్రమాదకర చర్య జరుపుతాయి.

రసాయన చర్య

ఈ చర్య వల్ల అక్రిలమైడ్ అనే హానికర రసాయనం ఉత్పన్నమవుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ప్రాణాంతక రసాయనం

కాబట్టి బంగాళాదుంపలను ఎప్పుడూ ఫ్రిజ్‌లో కాకుండా గది ఉష్ణోగ్రత వద్ద, గాలి తగిలే పొడి ప్రదేశంలో మాత్రమే నిల్వ చేయండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి!

ఎలా నిల్వ చేయాలి?