Health Tips : వావ్ వంకాయ మజాకా… కూరగాయలకే రారాజు.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. అలాగే వంకాయలోని పోషకాలు చర్మాన్ని, జుట్టును, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తాయి. వంకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వంకాయ తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

వంకాయలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండే వంకాయ తినడం వల్ల బరువు తగ్గటం ఈజీ అవుతుంది. వంకాయ గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల నుండి రక్షిస్తుంది. వంకాయలో విటమిన్ కె, విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. వంకాయలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వంకాయలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటం ద్వారా శరీరాన్ని రక్షిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి..
వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నశింపజేసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడడంలో సహాయపడతాయి. వంకాయలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.. సులువుగా బరువు తగ్గవచ్చనని నిపుణులు చెబుతున్నారు. వంకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వంకాయలో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
వంకాయలను తరచూ మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గడంతో పాటు కంటి చూపు మెరుగు పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది. అలాగే వంకాయలోని పోషకాలు చర్మాన్ని, జుట్టును, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తాయి. వంకాయను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. వంకాయ తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








