Clove Oil Benfits : లవంగం నూనె గురించి మీకు తెలుసా..? ఈ ఐదు శరీర సమస్యలకు దివ్య ఔషధం..!

Clove Oil Benfits : మన వంటింట్లో సులభంగా దొరికే ఒక మసాల దినుసు లవంగం. దీనికి చాలా ప్రత్యేకత ఉంది.

Clove Oil Benfits : లవంగం నూనె గురించి మీకు తెలుసా..? ఈ ఐదు శరీర సమస్యలకు దివ్య ఔషధం..!
Clove Oil
Follow us
uppula Raju

|

Updated on: Jun 07, 2021 | 2:21 PM

Clove Oil Benfits : మన వంటింట్లో సులభంగా దొరికే ఒక మసాల దినుసు లవంగం. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. సనాతన కాలం నుంచి ఆయుర్వేద ప్రముఖులు దీనిని ఔషధాలలో వాడుతున్నారు. వివిధ రకాల కూరలు, బిర్యానీలలో రుచికోసం దీనిని ఉపయోగిస్తారు. ఇందులో విటమిన్ C, K, ఫైబర్ (పీచు), మాంగనీస్, ఉంటాయి. మనకు గాయం అయినప్పుడు రక్తం కారిపోకుండా గడ్డకట్టాలంటే విటమిన్ K అవసరం. అది లవంగాల్లో దొరుకుతుండటం మన అదృష్టం. లవంగాలు కేన్సర్ అంతు చూస్తాయి కూడా.

అయితే లవంగం నూనె గురించి చాలామందికి తెలియదు కానీ ఇది చాలా లాభదాయకమైనది యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది యాంటీ-ఆక్సిడెంట్స్‌కు గొప్ప వనరు. లవంగనూనె లక్షణాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఎందుకంటే ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, బ్యాక్టీరియా, ఫంగస్ ఎదుగుదలను ఆపగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. లవంగం నూనెను సాధారణంగా అనేక దగ్గు సిరప్‌లలో కలుపుతారు. ఇది సిరప్ రుచిని మెరుగుపరుస్తుంది సాధారణంగా దంత సమస్యలకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు.

1. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది రక్తనాళాలను ఎక్కువగా తెరుచుకునేట్లుగా చేస్తుంది. తద్వారా వివిధ రకాల నొప్పులు తగ్గి ఉపశమనం కలుగుతుంది. 2. జీర్ణక్రియకు సహాయపడుతుంది నరాలను ప్రశాంతం చేస్తుంది. 3. పంటి నొప్పిని నయం చేస్తుంది ఎందుకంటే దీనిలో జెర్మిసైడల్ లక్షణాలు ఉంటాయి. ఇది పంటి నొప్పి చిగుళ్ల నొప్పికి చికిత్స చేయడంలో సహాయపడుతుంది. 4. లవంగం నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల వ్యాధినిరోధకశక్తి పెరుగుతుంది. 5. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, ఫ్రీరాడికల్స్ ఉనికిని తగ్గిస్తుంది.

Hyderabad: ఇంటిలోని చెత్తను ఖాళీ ప్రదేశంలో పడేస్తున్నారా..?.. తిరిగే అదే చెత్త మీ ఇంటి ముందుకు వ‌స్తుంది

Apple Ipad Pro: కొత్త టెక్నాల‌జీతో రానున్న యాపిల్ ఐప్యాడ్‌.. వ‌చ్చే ఏడాది నాటిని మార్కెట్లోకి వచ్చే అవ‌కాశం..

Evelyn Sharma: బెస్ట్ ఫ్రెండ్‏ను సీక్రెట్‏గా పెళ్లి చేసుకున్న ‘సాహో’ బ్యూటీ.. సోషల్ మీడియాలో ఫోటోస్ వైరల్..