Narender Vaitla |
Updated on: Jun 07, 2021 | 2:13 PM
ప్రపంచ టెక్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది యాపిల్ సంస్థ. ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీని యూజర్లకు పరిచయం చేస్తుంది కాబట్టే యాపిల్ బ్రాండ్‌కు అంత పాపులారిటీ వచ్చింది.
ఈ క్రమంలో వినియోగదారులకు మరింత చేరువకావడానికి యాపిల్ తన యాపిల్ ఐప్యాడ్‌కు వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ప్రస్తుతం యాపిల్ నిపుణులు ఈ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాడక్ట్ మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
ఐప్యాడ్ ప్రో మోడళ్లలో ఈ వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకురానున్నారు. ఇందుకోసం అల్యుమినియం ఎన్‌క్లోజర్ బదులు గ్లాస్ ఎన్‌క్లోజర్ ను అమర్చనుంది.
ఇటు వైర్‌లెస్ ఛార్జింగ్‌తో పాటు కేబుల్ సాయంతో ఛార్జింగ్ పెట్టుకునేలా థండర్ బోల్డ్ పోర్టును కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు యాపిల్ ప్రయత్నాలు చేస్తోంది.
ఇందులో భాగంగా.. ఐపాడ్ ప్రో వెనుక భాగం నుంచి ఐఫోన్ లేదా ఎయిర్ పాడ్‌లు ఛార్జింగ్ పెట్టుకునేలా వెసలు బాటు కల్పించాలని యాపిల్ ప్రతినిధులు భావిస్తున్నారు.