AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beer Yoga : బీర్ యోగా గురించి మీకు తెలుసా..? శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి కావాలంటే తెలుసుకోవాల్సిందే..

Beer Yoga : యోగా చేయడం ద్వారా ఒక వ్యక్తికి శారీరక, మానసిక ప్రయోజనాలన్నీ లభిస్తాయని అంటారు. అంతేకాదు

Beer Yoga : బీర్ యోగా గురించి మీకు తెలుసా..? శారీరక, మానసిక బాధల నుంచి విముక్తి కావాలంటే తెలుసుకోవాల్సిందే..
Beer Yoga
uppula Raju
|

Updated on: May 31, 2021 | 3:23 PM

Share

Beer Yoga : యోగా చేయడం ద్వారా ఒక వ్యక్తికి శారీరక, మానసిక ప్రయోజనాలన్నీ లభిస్తాయని అంటారు. అంతేకాదు వ్యాధులు అతడి దరిచేరవని చెబుతారు. యోగా ద్వారా చాలా వ్యాధులను నయం చేయవచ్చని వివిధ అధ్యయనాల ద్వారా తేలింది. శిక్షణ పొందిన వ్యక్తి నుంచి నేర్చుకోవడం ద్వారా యోగా జరుగుతుంది. కానీ చాలా మందికి యోగా చేయడం బోరింగ్‌గా అనిపిస్తుంది. ఈ రోజు మనం అలాంటి వారికి కొత్తరకం యోగాను పరిచయం చేద్దాం. బీర్ యోగా గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఇది విదేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. బీర్ తాగడానికి ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ యోగాను కనిపెట్టారు. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

బీర్ యోగా ఎలా ఉంటుంది బీర్ తాగడానికి బానిసలైన వారి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బీర్, యోగా కలయిక జరిగింది. కొద్దిగా బీరు తాగడం ద్వారా ఈ యోగా ప్రారంభమవుతుంది. ఇది కాకుండా యోగా చేసేటప్పుడు సిప్-సిప్ బీర్ తాగుతారు. ప్రజలు బీర్ బాటిళ్లను తమ తలపై ఉంచుతారు లేదా ఒక గ్లాసు బీరును సమతుల్యం చేస్తారు. మొత్తంగా ఈ యోగాలో పూర్తిగా బాటిల్ బీర్ తాగేస్తారు. ఈ యోగా జర్మనీలో ప్రారంభమైంది కానీ నేడు ఈ ధోరణి ఆస్ట్రేలియా, అమెరికా కూడా వేగంగా అనుసరిస్తోంది. క్రమంగా దీనికి జనాదరణ పెరుగుతోంది. బీర్ యోగాను బెర్లిన్‌కి చెందిన ఇద్దరు యోగా శిక్షకులు ఎమిలీ, జూలా 2016 లో ప్రారంభించారు. దీనిని ప్రజలు చాలా ఇష్టపడ్డారు. దాని జనాదరణ మొదట జర్మనీలో తరువాత ఇతర దేశాలలో వేగంగా ప్రారంభమైంది. భవిష్యత్తులో బీర్ యోగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఫిట్‌నెస్ పోకడలలో ఒకటిగా నిలుస్తుంది.

భారతీయ సంస్కృతికి మంచిది కాదు బీర్ యోగాకు సంబంధించి భారతదేశంలోని యోగా నిపుణులు ఇది భారతీయ సంస్కృతికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. భారతదేశంలో యోగా మూలాలు చాలా పాతవి. నాగరికత ప్రారంభం నుంచి భారతదేశంలో యోగా జరుగుతోందని చెబుతారు. అటువంటి పరిస్థితిలో ఇది వేర్వేరు నియమాలను కలిగి ఉంటుంది. సాత్విక్ జీవనశైలిని యోగాతో అనుసరించాలి. యోగా సమయంలో ఏదైనా తినడం సరైనది కాదు.

WORLD NO TOBACCO DAY-2021 : మూడు అంగుళాల సిగరెట్ మీ ప్రాణాలను హరిస్తుంది..! కరోనా వస్తే వెంటిలేటర్ కచ్చితం..?

Xavier Doherty: ఆర్ధిక ఇబ్బందులతో.. కార్పెంటర్‌గా మారిన ఆస్ట్రేలియన్‌ మాజీ క్రికెటర్‌.. వీడియో

Covid-19 from Wuhan lab: కృత్రిమంగానే వైరస్‌ సృష్టి.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా.. ‘డైలీ మెయిల్‌’ కథనంలో సంచలన నిజాలు