Diabetes: రాత్రుళ్లు కనిపించే ఈ లక్షణాలు.. డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు..

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా మధుమేహం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కసారి మధుమేహం బారిన పడితే పూర్తిగా కోలుకోవడం అంత సులభమైన విషయం కాదు. జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా మాత్రమే షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు...

Diabetes: రాత్రుళ్లు కనిపించే ఈ లక్షణాలు.. డయాబెటిస్‌కు సంకేతాలు కావొచ్చు..
Diabetes
Follow us

|

Updated on: Jul 08, 2024 | 11:54 AM

ప్రస్తుతం ప్రపంచంలో శరవేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో డయాబెటిస్‌ ఒకటి. రోజురోజుకీ ఈ వ్యాధి బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్‌లో దాదాపు 10 కోట్ల మంది ఈ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే కనిపించే షుగర్‌ వ్యాధి, ప్రస్తుతం 30 ఏళ్లలో వారికి కూడా కనిపిస్తుండం ఆందోళన కలిగిస్తోంది.

మారుతోన్న జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా మధుమేహం బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్కసారి మధుమేహం బారిన పడితే పూర్తిగా కోలుకోవడం అంత సులభమైన విషయం కాదు. జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా మాత్రమే షుగర్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే మధుమేహాన్ని ముందస్తుగా గుర్తిస్తేనే ఇది సాధ్యమవుతుంది. మధుమేహం వస్తుందన్న విషయాన్ని శరీరం కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే చెబుతుంది.

ముఖ్యంగా రాత్రి సమయాల్లో కనిపించే కొన్ని లక్షణాల ఆధారంగా డయాబెటిస్‌ను గుర్తు పట్టొచ్చు. అలాంటి కొన్ని లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రుళ్లు కంటి చూపు తగ్గుతున్నట్లు అనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్‌ పెరిగితే.. కంట్లో ఉండే కణాలపై ప్రభావం పడుతుంది. దీంతో చూపు మసకగా, అస్పష్టంగా మారుతుంది. కాబట్టి రాత్రుళ్లు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి.

ఇక రాత్రి వేళ అదే పనిగా దాహం వేస్తుంటే కూడా మధుమేహం ముందస్తు లక్షణంగా భావించాలి. ఇక డయాబెటిస్‌ ఉంటే కనపించే ప్రధాన లక్షణాల్లో తరచూ మూత్రం రావడం ఒకటి. పదే పదే మూత్రానికి నిద్రలోంచి లేవాల్సి వస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలని చెబుతున్నారు. రక్తంలో చక్కెర నిల్వలు ఎక్కువైనప్పడు కిడ్నీలు యూరిన్ ద్వారా బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తుంది. అందుకే రాత్రి వేళ ఈ సమస్య ఎక్కువగా కన్పిస్తుంటుంది.

రాత్రుళ్లు పడుకున్న తర్వాత కాళ్లలో నొప్పి, తిమ్మిరిగా ఉండడం, క్రాంప్స్‌ ఏర్పడడం వంటివి కూడా డయాబెటిస్‌కు ముందస్తు లక్షణాలుగా భావించాలి. పైన తెలిపిన లక్షణాల్లో ఏవి కనిపించినా వెంటనై వైద్యులను సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..