Dental Care Tips: బ్రష్ చేసే సమయంలో చాలా మంది ఈ తప్పులు చేస్తారు.. 40 శాతం క్రిములు మీ నోట్లోనే..
దంతాలను సరిగ్గా శుభ్రంగా ఉంచుకుంటే, అవి మీ అందాన్ని పెంచుతాయి. అయితే చాలామంది సమస్య ఏమిటంటే బ్రష్ చేసే సరైన మార్గం తెలియదు. మురికి ప్రధానంగా చిగుళ్ళు, దంతాల మధ్య చిక్కుకుపోతుంది. మురికిని శుభ్రం చేయకపోతే, నోటి లోపల బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా దంతాల పై పొర పసుపు రంగులోకి మారుతుంది. నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. కనుక ఈ రోజు దంతాలు అందంగా ఆరోగ్యంగా ఉండేలా బ్రష్ చేయడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.
అందమైన చిరు నవ్వుకు చిరునామా శుభ్రమైన దంతాలు.. అవును ఆరోగ్యకరమైన శుభ్రమైన దంతాలు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. దంతాలను శుభ్రంగా ఉంచుకోవడానికి, ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేయడం ముఖ్యం. ఉదయం నిద్రలేచిన తర్వాత.. రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్ర పోయే ముందు రోజుకు రెండు సార్లు దంతాలను శుభ్రం చేసుకోవాలి. దంతాలను సరిగ్గా శుభ్రంగా ఉంచుకుంటే, అవి మీ అందాన్ని పెంచుతాయి. అయితే చాలామంది సమస్య ఏమిటంటే బ్రష్ చేసే సరైన మార్గం తెలియదు. మురికి ప్రధానంగా చిగుళ్ళు, దంతాల మధ్య చిక్కుకుపోతుంది. మురికిని శుభ్రం చేయకపోతే, నోటి లోపల బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా దంతాల పై పొర పసుపు రంగులోకి మారుతుంది. నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది. కనుక ఈ రోజు దంతాలు అందంగా ఆరోగ్యంగా ఉండేలా బ్రష్ చేయడానికి సరైన మార్గం ఏమిటో తెలుసుకుందాం.
రెండు నిమిషాల కంటే ఎక్కువ బ్రష్ చేయవద్దు: రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేయడం అలవాటు చేసుకోవాలని చాలా పరిశోధనల్లో తేలింది. దీనితో పాటు.. ఫ్లోరైడ్ ఉన్న టూత్‌పేస్ట్‌ను ఉపయోగించండి. రెండు నిమిషాలకు మించి బ్రష్ చేయవద్దు.. ఎక్కువ సమయం దంతాలను బ్రష్ చేసి తప్పు చేయవద్దు.
ఇలాంటి బ్రష్ ఉపయోగించండి: దంత ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన బ్రష్‌ను ఉపయోగించడం చాలా ముఖ్యం. బ్రష్ సరిగ్గా లేకుంటే దంతాల నుండి మురికి బయటకు రాదు. హార్డ్ బ్రష్‌ను ఉపయోగిస్తే, అది పళ్ళమీద ఉన్న ఎనామెల్‌ను దెబ్బతీస్తుంది. అదే విధంగా ఎక్కువ మృదువుగా ఉన్న బ్రష్‌ను ఉపయోగిస్తే కూడా దంతాలు శుభ్రం అవ్వదు. కనుక చాలా మృదువైన లేదా చాలా గట్టి బ్రష్‌ను దంతాలను శుభ్రం చేయడానికి ఉపయోగించవద్దు.
బ్రష్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగవద్దు: దంతాలను శుభ్రం చేసుకోవడానికి బ్రష్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటే వెంటనే మార్చుకోండి. ఇలా చేయడం వల్ల దంతాల బయటి పొర దెబ్బతింటుంది. అంతేకాదు సిగరెట్ లేదా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే అలవాటు ఉంటే అది దంతాలను కూడా దెబ్బతీస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..