Curd Hair Mask: పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే చాలు.. 10రోజుల్లో తెల్లజుట్టు నల్లగా, పట్టులా మెరిసిపోతుంది..!

ఇప్పుడు ఈ మిశ్రమానికి ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్ ను మీ జుట్టు నుండి చివర్ల వరకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో మీ తలను కడగాలి. ఇలా రెండు మూడు రోజులకొకసారి చేస్తే తెల్లజుట్టు నల్లగా, సిల్క్ లాగా మెరిసిపోతుంది.

Curd Hair Mask: పెరుగుతో ఇది కలిపి ప్యాక్‌ వేస్తే చాలు.. 10రోజుల్లో తెల్లజుట్టు నల్లగా, పట్టులా మెరిసిపోతుంది..!
Curd Hair Mask
Follow us

|

Updated on: May 24, 2024 | 8:32 AM

పెరుగును ఆహారం కోసం మాత్రమే కాకుండా చర్మం, జుట్టు కోసం కూడా వివిధ మార్గాల్లో ఉపయోగించవచ్చు. పెరుగులో మంచి మొత్తంలో ప్రొటీన్లు, కాల్షియం, పొటాషియం, విటమిన్ ఎ, విటమిన్ బి5 మరియు విటమిన్ డి ఉన్నాయి. కాబట్టి దీన్ని జుట్టు సంరక్షణకు ఉపయోగించవచ్చు. పెరుగును అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఇది చుండ్రును కూడా తొలగిస్తుంది. జుట్టును మృదువుగా చేస్తుంది.

పెరుగు, మెంతుల పొడితో హెయిర్‌ప్యాక్‌..

పెరుగు శిరోజాలను సరిగ్గా శుభ్రపరుస్తుంది. జుట్టుకు డీప్ కండిషనింగ్ అందిస్తుంది. పెరుగు జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. 5 చెంచాల పెరుగు తీసుకుని అందులో 5 చెంచాల మెంతిపొడి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి ఆలివ్ ఆయిల్ వేసి పేస్ట్ చేయాలి. ఈ హెయిర్ మాస్క్ ను మీ జుట్టు నుండి చివర్ల వరకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో మీ తలను కడగాలి. ఇలా రెండు మూడు రోజులకొకసారి చేస్తే తెల్లజుట్టు నల్లగా, సిల్క్ లాగా మెరిసిపోతుంది.

ఇవి కూడా చదవండి

పెరుగుతో నల్ల మిరియాల పొడి కలిపి హెయిర్‌ప్యాక్‌..

జుట్టు ఎక్కువగా రాలుతుందని బాధపడేవారు మిరియాల పొడి, పెరుగుతో తయారు చేసిన ఈ మాస్క్​ను ఉపయోగించవచ్చు. పెరుగు, నల్ల మిరియాలు పొడిని బాగా మిక్స్‌ చేసి తలకు పట్టించి..స్మూత్‌గా మసాజ్ చేయండి. 10 నిమిషాలు అలాగే వదిలేయండి. ఇది తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుంది.

కొబ్బరి నూనెలో పెరుగు కలిపి హెయిర్ ప్యాక్ వాడితే..

కొబ్బరి నూనె, పెరుగు హెయిర్ మాస్క్ జుట్టుకు అద్భుతమైన మాయిశ్చరైజింగ్‌ను అందిస్తుంది. కొబ్బరినూనెలో 1 భాగాన్ని తీసుకుని వేడియాలి. దానిలో ఒక స్పూన్‌ తేనె కలపాలి. అది చల్లారిన తర్వాత.. తలకు సరిపడా తాజా పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్, హెయిర్ రూట్స్‌తో పాటుగా జుట్టు చివర్ల వరకు అప్లై చేయాలి. సుమారు 30 నిమిషాల పాటు బాగా ఆరిన తరువాత కడిగేయాలి.

పెరుగులో ఆలివ్‌ ఆయిల్‌ హెయిర్‌ప్యాక్..

జుట్టు కుదుళ్లు బలంగా, ఒత్తుగా పెరగాలంటే పెరుగును ఆలివ్ ఆయిల్, తులసి ఆకుల పొడితో కలిపి ప్యాక్‌ తయారు చేసుకుని వాడండి. ఈ పదార్థాలన్నీ కావాల్సిన మోతాదులో తీసుకుని బాగా మిక్స్‌ చేసి తలకు పట్టించాలి. ఇది 30 నిమిషాల పాటు ఆరిన తరువాత కడిగేయాలి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..