Self Confidence: పిల్లలలో ఆత్శవిశ్వాసం నింపడానికి తల్లిదండ్రులు తప్పక పాటించవలసిన నాలుగు సూత్రాలు..

ఆత్మవిశ్వాసంతో ఉన్న పిల్లవాడు జీవితంలోని ప్రతి పరీక్షను సులభంగా అధిగమించగలడు. తల్లితండ్రులు తమ పిల్లలలో ఆత్మవిశ్వాసం నింపేందుకు చిన్నతనం నుంచే కృషి చేయాలి. చాలా సార్లు పిల్లలు..

Self Confidence: పిల్లలలో ఆత్శవిశ్వాసం నింపడానికి తల్లిదండ్రులు తప్పక పాటించవలసిన నాలుగు సూత్రాలు..
Self Confidence In Kids
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Nov 20, 2022 | 4:05 PM

ఆత్మవిశ్వాసంతో ఉన్న పిల్లవాడు జీవితంలోని ప్రతి పరీక్షను సులభంగా అధిగమించగలడు. తల్లితండ్రులు తమ పిల్లలలో ఆత్మవిశ్వాసం నింపేందుకు  చిన్నతనం నుంచే  కృషి చేయాలి. చాలా సార్లు పిల్లలు ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్లనే వారి జీవితంలో చాలా మంచి అవకాశాలను కోల్పోతారు. ఇంకా కొందరు తమను తామే తక్కువగా పరిగణించుకుంటారు. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితిలో పిల్లలకు ఆత్మవిశ్వాసం పెరిగేలా, దానిని పెంపొందించేలా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత అవుతుంది. అందుకోసం ఉపకరించే మూడు ప్రభావవంతమైన చిట్కాలు మీ కోసం..

పిల్లలను ప్రశంసించడం..: పిల్లలు మంచి పని చేసినప్పుడల్లా వారిని ప్రశంసించండి. ఆ తర్వాత వారు మరింత మెరుగ్గా ఆ పనిని చేసేలా ప్రోత్సహించండి. ఇంకా ప్రతి కార్యకలాపంలోనూ వారు పాల్గొనేలా ముందుకు నడిపించండి.

పిల్లలను ప్రేమించండి..:  మీ ఒత్తిడితో కూడిన జీవితంలో తప్పనిసరిగా పిల్లలకు కొంత సమయం ఇవ్వండి. వారితో ప్రేమగా మాట్లాడుతూ.. వారి ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానం చెప్పండి. వాటిని ఆసక్తిగా వినండి. అలా వారిలో జిజ్ఙాసను పెంపొందించండి.

ఇవి కూడా చదవండి

ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండం.: పిల్లలు మీకు తెలియకుండానే మీ పరిసరాల నుంచి కూడా చాలా నేర్చుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను ప్రతికూల వాతావరణం నుంచి దూరంగా ఉంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులగా మీపైనే ఉంటుంది.

ఏది ఒప్పో ఏది తప్పో చెప్పండం..: మీ పిల్లలు కొన్నిసార్లు తమకు తెలియకుండానే తప్పు దారిలో పయనిస్తారు, ఆ సమయంలో వారిని కూర్చోబెట్టి ఏది ఒప్పో ఏది తప్పు అని చెప్పడం చాలా మంచిది. అలా చెప్పే క్రమంలో వారికి అర్థంమయ్యేలా చెప్పండి. కానీ మీ మాటల వల్ల పిల్లలు నొచ్చుకునేలా మాట్లాడకండి.

జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..